Papaya Health Benefits: హార్ట్ పేషెంట్స్, డయాబెటిస్ పేషెంట్స్‌కి బొప్పాయి పండు మంచిదేనా?

All About Papaya: Nutrition, Health Benefits
x

Papaya Health Benefits: హార్ట్ పేషెంట్స్, డయాబెటిస్ పేషెంట్స్‌కి బొప్పాయి పండు మంచిదేనా?

Highlights

Health Tips: మన దేశంలో పోషకాహారం లోపం కారణంగా ఎంతో మంది అనారోగ్యానికి గురవుతున్నారు.

Health Tips: మన దేశంలో పోషకాహారం లోపం కారణంగా ఎంతో మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భవతుల్లో పోషకాహార లోపం అధికంగా ఉంది. అందుకే మన వైద్యులు మెరుగైన ఆరోగ్యం కోసం పండ్లు తీసుకోమంటున్నారు. శరీరానికి శక్తిని అందించడంలో పండ్లకు ఉన్న శక్తే వేరు. మరి బొప్పాయి పండుతో కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుంద్దాం.

బొప్పాయి పండు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బొప్పాయిలో విటమిన్‌సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం.. కాబట్టి రెగ్యులర్‌గా బొప్పాయి పండు తినడం ఉత్తమం. బొప్పాయి పండులో శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో ఫ్లావనాయిడ్స్, మినరల్స్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలుంటాయి. బొప్పాయి ఆరోగ్యాన్ని పెంపొందించటమే కాకుండా, శరీరానికి కావలసిన పోషకాలను సమృద్దిగా అందిస్తుంది.

బొప్పాయిపండులో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట్ వాడకాన్ని పెంచి.. బరువును తగ్గిస్తుంది. బొప్పాయి పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్స్, యాంటీ-ఆక్సిడెంట్ లను కలిగి ఉండి, అధిక కొవ్వు పదార్థాల వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రమాదాల నుంచి, గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అలసట, మార్నింగ్ సిక్ నెస్, అనారోగ్య సమస్యలు నివారించడానికి బొప్పాయి సహకరిస్తుంది. రోజులో రెండు సార్లు బొప్పాయి పండు తినటం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. బొప్పాయి ఆకులు రుతుక్రమ సమయంలో కలిగే నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

బొప్పాయి పండులో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఏ, సి, ఈ లను పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తాయి. క్యాన్సర్ నివారించడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది. ఇందులో బీటా కెరోటిన్, ల్యూటీన్, క్సాంతిన్, సిప్రోటాక్సింతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. పొట్ట, పేగులలో హాని కలిగించే విష పదార్థాలకు టానిక్‌లా బొప్పాయి పనిచేస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియ సజావుగా జరగడానికి ఈ ఫ్రూట్ సహకరిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బొప్పాయికి వయసు ఛాయలు కనిపించకుండా చేసే శక్తి ఉంది. 5 సంవత్సరాలు తగ్గించి.. యవ్వనంగా కనపడేలా చేస్తుంది. చర్మం నిగారింపు సంతరించుకోవడానికి బొప్పాయి సహకరిస్తుంది. బొప్పాయి పండు తినటం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉండటంతో పాటు కంటి చూపును మెరుగుపరుస్తుంది. యుక్త వయసులో పండ్లను ఎక్కువగా తీసుకుంటే.. భవిష్యత్ లో కంటి సమస్యలు తక్కువగా ఉంటాయి.

బొప్పాయి పండు తియ్యగా ఉన్నప్పటికీ.. బీపీ పేషంట్స్‌కి మంచి పరిష్కారం. మధుమేహంను కంట్రోల్ చేయడానికి సహకరిస్తుంది. ఒత్తిడిగా ఫీలయినప్పుడు వెంటనే బొప్పాయి పండు తిని చూడండి.. తేడా మీకే తెలుస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి.. కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే బొప్పాయిని ఫ్రూట్ ఆఫ్ ఏంజెల్స్ గా పిలుస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories