Women Health: మహిళలకి అలర్ట్‌.. ఆ సమయంలో ఎలాంటి ఆహారం తినాలి.. ఎలాంటి ఆహారం తినకూడదు..?

Alert for Women what Kind of Food to Eat During Period What Kind of Food Not to Eat
x

Women Health: మహిళలకి అలర్ట్‌.. ఆ సమయంలో ఎలాంటి ఆహారం తినాలి.. ఎలాంటి ఆహారం తినకూడదు..?

Highlights

Women Health: మహిళలు పీరియడ్స్‌ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Women Health: మహిళలు పీరియడ్స్‌ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేతులు, కాళ్ళలో నొప్పి, వెన్నునొప్పి, కడుపులో నొప్పి ఇంకా మొదలైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు చాలా నీరసంగా ఉండి అలసిపోతారు. చిరాకు, కోపం లాంటివి ఏర్పడుతాయి. ఇలాంటి సమయంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పీరియడ్స్ సమయంలో ఎలాంటి పదార్థాలు తినాలి.. ఎలాంటివి తినకూడదో ఈరోజు తెలుసుకుందాం.

పసుపు

పసుపులో కర్కుమిన్ అనే రసాయనం ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కండరాల నొప్పులను నయం చేస్తాయి.

ఐరన్‌

ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారాలని తినాలి. వీటివల్ల రక్తహీనత ఏర్పడదు. ముఖ్యంగా ఆహారంలో నల్ల శనగలు, బెల్లం, బీన్స్, బచ్చలికూర, డార్క్ చాక్లెట్ వంటివి చేర్చుకోవాలి.

అరటిపండ్లు

అరటిపండులో విటమిన్ 6 అలాగే పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఉబ్బరం, తిమ్మిరి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. బనానా చాట్ కూడా తినవచ్చు.

పీనట్‌ బటర్‌

పీనట్ బటర్‌లో బి6, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి తిమ్మిరి వంటి లక్షణాలను నయం చేయడానికి పని చేస్తాయి. ఇది సెరోటోనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

హెర్బల్‌ టీ

హెర్బల్ టీలో అనేక ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఈ టీ తాగడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా కండరాలు రిలాక్స్ అవుతాయి.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్‌లో ఎండార్ఫిన్‌లు ఉంటాయి. ఇవి ఒక రకమైన సంతోషకరమైన హార్మోన్ విడుదల చేస్తాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

వీటిని అస్సలు తినవద్దు

చక్కెర

స్వీట్లు, చక్కెర పదార్థాలు తినకూడదు. చక్కెర ఎక్కువగా ఉండే ఐస్ క్రీం, క్యాండీ వంటివాటికి దూరంగా ఉండాలి. కేక్‌ల జోలికి అస్సలు పోవద్దు.

జంక్ ఫుడ్స్

జంక్ ఫుడ్స్ తినడం మానుకుంటే ఉత్తమం. ఈ ఆహారాలు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కలిగిస్తాయని గుర్తుంచుకోండి.

ఉప్పు

ఉప్పు అతిగా ఉండే ఆహారాలు తినకూడదు. ఇవి రక్తపోటు స్థాయిని పెంచుతాయి. దీంతోపాటు కార్బోహైడ్రేట్ పానీయాలను తీసుకోకుండా ఉండాలి. వీలైనంత వరకు ఆయర్వేద చిట్కాలని పాటిస్తే మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories