Women Health: మహిళలకి అలర్ట్‌.. బ్రెస్ట్ క్యాన్సర్ రావొద్దంటే ఇవి తప్పనిసరి..!

Alert for Women Follow These Tips to Prevent Breast Cancer
x

Women Health: మహిళలకి అలర్ట్‌.. బ్రెస్ట్ క్యాన్సర్ రావొద్దంటే ఇవి తప్పనిసరి..!

Highlights

Women Health: ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

Women Health: ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే మహిళలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఈ వ్యాధి రోజు రోజుకి పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. చాలా సందర్భాలలో రొమ్ము క్యాన్సర్ ఒక తరం నుంచి మరొక తరానికి సంభవిస్తుంది. క్యాన్సర్ కేసుల్లో అధిక శాతం జన్యుపరమైనవే. దీనిని నివారించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బీఎస్ఏ జన్యువుల ద్వారా ఈ క్యాన్సర్ ఒక తరం నుంచి మరో తరానికి వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

బ్రెస్ట్ క్యాన్సర్‌కి ప్రధాన కారణం నిర్లక్ష్యం. వ్యాధి లక్షణాలను సకాలంలో గుర్తించకపోవడం. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న కుటుంబాల్లో ఒక తరం నుంచి మరో తరానికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారు సకాలంలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. తద్వారా వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స చేయవచ్చు. దీనిని నివారించడానికి BRSA జన్యు పరీక్ష చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో మహిళలు పెద్ద వయసులోపెళ్లి చేసుకుంటున్నారు. అంతేకాదు పెద్ద వయసులో పిల్లలకు జన్మనివ్వడం వల్ల పిల్లలకు తల్లిపాలు కూడా ఇవ్వడం లేదు.

ఇంతకుముందు 50 ఏళ్లు పైబడిన మహిళల్లో ఈ క్యాన్సర్ కేసులు కనిపించేవి. కానీ ఇప్పుడు 30 నుంచి 45 ఏళ్ల వయస్సులో ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్యాన్సర్‌ని వెంటనే గుర్తించినట్లయితే చికిత్స చేయడం సులువు అవుతుంది. ఒకవేళ కేసు అడ్వాన్స్‌డ్ స్టేజ్‌కి వెళితే చికిత్స చేయడం చాలా కష్టం అవుతుంది. అయినప్పటికీ ఇప్పుడు చాలా కొత్త టెక్నిక్‌లు వచ్చాయి. తద్వారా క్యాన్సర్ చికిత్స మునుపటి కంటే సులభమని చెప్పవచ్చు.

ఈ చిట్కాలను అనుసరించండి

1. BRCA జన్యు పరీక్షను చేయించుకోవాలి.

2. 40 ఏళ్ల తర్వాత మామోగ్రామ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.

3. బరువును అదుపులో ఉంచుకోవాలి.

4. మద్యం, ధూమపానం చేయవద్దు

5. రొమ్ములో గడ్డ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories