Women Health: మహిళలకు అలర్ట్‌.. ఈ విటమిన్‌ లోపిస్తే వ్యాధులను ఆహ్వానించినట్లే..!

Alert for Women Deficiency of Vitamin D is like inviting Diseases
x

Women Health: మహిళలకు అలర్ట్‌.. ఈ విటమిన్‌ లోపిస్తే వ్యాధులను ఆహ్వానించినట్లే..!

Highlights

Women Health: ఈ రోజుల్లో మహిళలు కుటుంబ బాధ్యతల వల్ల తమని తాము మరిచి పోతున్నారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా వ్యాధులకు గురవుతున్నారు.

Women Health: ఈ రోజుల్లో మహిళలు కుటుంబ బాధ్యతల వల్ల తమని తాము మరిచి పోతున్నారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా వ్యాధులకు గురవుతున్నారు. బాడీలో కొన్ని విటమిన్లు లోపించడం వల్ల తరచుగా ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా డి విటమిన్‌ అవసరం. ఇది లోపిస్తే వారు స్ట్రోక్, ఎముకలు, కీళ్లలో నొప్పిని ఎదుర్కొంటారు. విటమిన్ డి లోపిస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఈ రోజు తెలుసుకుందాం.

1. ఇమ్యూనిటీ పవర్‌ తగ్గడం

శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉన్న స్త్రీలలో ఇమ్యూనిటీ పవర్‌ తగ్గుతుంది. దీంతో వారు త్వరగా వ్యాధులకు గురవుతారు. విటమిన్ డి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఇన్ఫెక్షన్లు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2. అలసట

విటమిన్ డి లోపం కారణంగా మహిళలు రోజువారీ జీవితంలో సాధారణ కార్యకలాపాలు చేయడం కష్టమవుతుంది. వారు తరచుగా అలసట, బలహీనతను ఎదుర్కోవలసి ఉంటుంది. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది.

3. టెన్షన్

మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో విటమిన్ డి సాయపడుతుంది. మహిళలు మానసికంగా సున్నితంగా ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా ఈ విటమిన్లను పొందాలి. లేదంటే టెన్షన్ డిప్రెషన్‌కు గురవుతారు.

4. ఎముకల బలహీనత

కాల్షియం మాదిరి విటమిన్ డి ఎముకలను బలంగా మారుస్తుంది. స్త్రీలు శరీరంలో ఈ విటమిన్ తగినంత మొత్తంలో పొందకపోతే వారి ఎముకలు గుళ్లబారుతాయి. చాలా నొప్పి భరించాల్సి ఉంటుంది.

విటమిన్ డి పొందడానికి ఏం చేయాలి..?

విటమిన్ డిని సన్‌షైన్ విటమిన్ అని అంటారు. ప్రతిరోజూ 10 నుంచి 20 నిమిషాలు సూర్యకాంతిలో ఉంటే మీకు విటమిన్‌ డి లభిస్తుంది. అయినప్పటికీ పాల ఉత్పత్తులు, కొవ్వు చేపలు, పుట్టగొడుగులు మొదలైన ఆహారాల ద్వారా కూడా విటమిన్ డి పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories