Desk Jobs Alert: డెస్క్​ జాబ్​ లకు రిస్క్​ ఎక్కువ.. డ్రింకింగ్​, స్మోకింగ్​ చేసినంత ప్రమాదం..!

Desk Jobs Alert
x

Desk Jobs Alert: డెస్క్​ జాబ్​ లకు రిస్క్​ ఎక్కువ.. డ్రింకింగ్​, స్మోకింగ్​ చేసినంత ప్రమాదం..!

Highlights

గంటల తరబడి ఒకేచోట కూర్చొని పనిచేసేవారికి ఊబకాయం, పొట్ట పెరగడం, మధుమేహం, రక్తపోటు, స్థూలకాయం, స్ట్రోక్, క్యాన్సర్, చెడు కొలెస్ట్రాల్, గుండెపోటు, సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా వస్తున్నట్లు డెస్క్​ జాబ్​ చేసేవారిపై చేసిన అధ్యయనంలో వెల్లడైంది.

Desk Jobs Alert: ఈ రోజుల్లో యువత డెస్క్​ జాబ్​ లవైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. కానీ ఇవి ఎంత ప్రమాదకరమైనవో ఆలస్యంగా తెలుసుకుంటున్నారు. ఏసీలో గంటల తరబడి కూర్చొని జాబ్​ చేయాలని కలలు కంటే పర్వాలేదు కానీ దానితో పాటు వ్యాధులను తట్టుకునే శక్తి కూడా ఉండాలని తెలుసుకోండి. డెస్క్​ జాబ్​ లో ఉదయం నుంచి మొదలు సాయంత్రం, రాత్రి వరకు ఒకేచోట గంటల తరబడి కూర్చొని పనిచేయాలి. ఇలా కూర్చొవడం అనేది డ్రింకింగ్​, స్మోకింగ్​ చేసేవారికంటే చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక అధ్యయనంలో డెస్క్​ జాబ్ లు చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయో తెలిసింది. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

అకాల మరణం

గంటల తరబడి ఒకేచోట కూర్చొని పనిచేసేవారికి ఊబకాయం, పొట్ట పెరగడం, మధుమేహం, రక్తపోటు, స్థూలకాయం, స్ట్రోక్, క్యాన్సర్, చెడు కొలెస్ట్రాల్, గుండెపోటు, సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా వస్తున్నట్లు డెస్క్​ జాబ్​ చేసేవారిపై చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు కొంతమంది కూర్చొన్న చోటే చనిపోయే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. మనిషికి కచ్చితంగా శారీరక శ్రమ చేయడం అవసరం. అందుకే డెస్క్​ జాబ్​ లు చేసేవారు ప్రతి గంటకు ఒకసారి లేచి వాకింగ్​ చేయడం అలవాటు చేసుకోవాలి.

ప్రమాదకర వ్యాధులు

డెస్క్​ జాబ్​ లు చేసేవారికి దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువగా వస్తున్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది. ఒకేచోట 8 నుంచి 10 గంటలు కూర్చొని పనిచేసేవారికి జీవక్రియకు సంబంధించిన అనేక వ్యాధులు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అధిక కొలెస్ట్రాల్ పెరిగి విపరీతంగా బరువు పెరుగుతారు.

పరిష్కార మార్గం

ఈ ఆరోగ్య సమస్యలు, వ్యాధుల బారిన పడకూడదంటే డెస్క్​ జాబ్​ లు చేసేవారు ప్రతి ఒక్కరూ ప్రతి గంటకు ఒక్కసారి లేచి కాస్త రిలాక్స్ కావాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం కాస్త శారీరక శ్రమ ఉండేలా ప్లాన్ చేసుకోవాలంటున్నారు. లేదంటే కొంత సమయం నిల్చుని పనిచేయాలంటున్నారు. ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయడం ద్వారా కాళ్లకు రక్తప్రసరణ జరిగి బాడీ నుంచి చెమట బయటకు వెళ్లిపోయి గుండె జబ్బులలాంటివి రాకుండా ఉంటుందని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories