Health Tips: పురుషులకి అలర్ట్‌.. ఈ నీటిని ముఖానికి పట్టిస్తే యవ్వనంగా కనిపిస్తారు..!

Alert for Men If you Apply Rice Water on Your Face You will Look Young
x

Health Tips: పురుషులకి అలర్ట్‌.. ఈ నీటిని ముఖానికి పట్టిస్తే యవ్వనంగా కనిపిస్తారు..!

Highlights

Health Tips: నేటి జీవనశైలిలో పురుషులు వారి ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. ఎంతసేపు ఉద్యోగం, పిల్లలు, కుటుంబం అంటూ గడుపుతారు.

Health Tips: నేటి జీవనశైలిలో పురుషులు వారి ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. ఎంతసేపు ఉద్యోగం, పిల్లలు, కుటుంబం అంటూ గడుపుతారు. దీంతో తొందరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి. అందుకే వారి అందం గురించి కూడా కాస్త పట్టించుకోవాలి. ఇందుకోసం ఖర్చు తక్కువ ఫలితం ఎక్కుగా ఉండే రైస్‌ వాటర్‌ని ఉపయోగిస్తే సరిపోతుంది. కొరియన్, జపనీస్ దేశాలలో చర్మ సంరక్షణ ఉత్పత్తులలో బియ్యం నీటిని ఎక్కువగా వాడుతారు. ఎందుకంటే ఇందులో అమినో యాసిడ్స్ వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఏజింగ్ ప్రక్రియను మందగించడంలో సహాయపడతాయని అనేక పరిశోధనలలో తేలింది.

రైస్ ఐస్ క్యూబ్స్

ఇందుకోసం ఒక ఐస్ ట్రేలో బియ్యం నీటిని నింపి ఫ్రిజ్లో పెట్టాలి. గడ్డ కట్టిన తర్వాత ఈ క్యూబ్‌లను మొత్తం ముఖంపై కళ్లపై బాగా రుద్దాలి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా ఉబ్బిన కళ్ల సమస్యను దూరం చేస్తుంది. అంతే కాదు ముఖంపై ఉన్న మచ్చలను తొలగించి కాంతివంతం చేస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

రైస్ వాటర్ అప్లై

ఒక కాటన్ బాల్‌లో రైస్ వాటర్ తీసుకొని ముఖానికి అప్లై చేయాలి. కొంత సమయం తర్వాత ముఖం కడుక్కుని శుభ్రం చేసుకోవాలి. దీని కారణంగా ముఖంపై వృద్ధాప్య సంకేతాలు తగ్గుతాయి. అలాగే చర్మం మెరుస్తుంది.

ఫేస్ మాస్క్‌

బియ్యం నీటితో ఫేస్‌ మాస్క్‌ కూడా తయారుచేసుకోవచ్చు. శనగపిండి కలిపిన బియ్యం నీళ్లను రాసుకుంటే ముఖంపై మచ్చలు పోతాయి. దీంతోపాటు ముఖం సహజమైన మెరుపును సంతరించుకుంటుంది.

బియ్యం నీటిని ఎలా తయారు చేయాలి..?

మొదటి మార్గం

ఇందుకోసం ఒక గిన్నెలో కొంచెం బియ్యం తీసుకొని అందులో నీరు పోసి మంటపై బాగా ఉడికించాలి. అన్నం ఉడికిన తర్వాత అందులోని నీటిని పాత్రలో తీసి ముఖానికి పట్టించాలి.

రెండవ పద్ధతి

ముందుగా ఏదైనా గిన్నెలో ఒక కప్పు బియ్యం తీసుకోవాలి. వాటిని అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత నీటిని వడకట్టి వాడుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories