Boys Face Wash: అబ్బాయిలకి అలర్ట్‌.. ఫేస్ వాష్ సమయంలో ఈ పొరపాట్లు చేయవద్దు..!

Alert for Boys do Not Make These Mistakes at all During Face Wash
x

Boys Face Wash: అబ్బాయిలకి అలర్ట్‌.. ఫేస్ వాష్ సమయంలో ఈ పొరపాట్లు చేయవద్దు..!

Highlights

Boys Face Wash: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అలాగే కొన్ని పొరపాట్లు కూడా చేస్తారు.

Boys Face Wash: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అలాగే కొన్ని పొరపాట్లు కూడా చేస్తారు. ముఖ్యంగా అబ్బాయిలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తరచుగా ఫేస్‌వాష్ సమయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. దీనివల్ల ముఖం డల్‌గా కనిపిస్తుంది. సరైన చర్మ సంరక్షణ కోసం సరైన పద్దతులని అనుసరించాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

చర్మానికి సరిపోయే ఫేస్ వాష్

ఆడవారిలాగే పురుషులు కూడా రోజూ ఫేస్ వాష్ చేస్తారు. కానీ చాలా పొరపాట్లు చేస్తారు. ముందుగా అబ్బాయిలు తమ చర్మానికి సరిపోయే ఫేస్ వాష్‌ని ఎంచుకోవాలి. ఇందుకోసం మీది ఏ రకమైన చర్మమో తెలుసుకోవాలి. ఇందుకోసం వైద్యుడి సలహా తీసుకోవచ్చు. సాధారణ చర్మం నుంచి పొడి చర్మం ఉన్న అబ్బాయిలు హైడ్రేటింగ్ ఫేస్ వాష్‌ని అప్లై చేయాలి. జిడ్డు చర్మం ఉన్న పురుషులు ఫోమ్ వాష్ లేదా జెల్ క్లెన్సర్‌ని ప్రయత్నించాలి.

సరైన విధానంలో ఫేస్ వాష్ అప్లై

అబ్బాయిలు ఎక్కువగా ఇంటి బయటే గడుపుతారు. అందుకే వారి చర్మంపై పొల్యూషన్‌ ప్రభావం పడుతుంది. రాత్రి ఇంటికి వచ్చి ఫేస్ వాష్ తీసుకొని త్వరగా ముఖం కడుగుతారు. ఇదే మీరు చేసే పెద్ద తప్పు.ఫేస్ వాష్ చేసేటప్పుడు తేలికపాటి చేతులతో మసాజ్ చేసి ఆపై చల్లటి నీటితో కడగాలి. అప్పుడే చర్మం మృదువుగా మారుతుంది.

రాత్రి పూట తప్పనిసరి

అబ్బాయిలు కనీసం రోజుకు రెండు సార్లు ముఖం కడుక్కోవాలి. ఉదయం ఒకసారి, రాత్రి పడుకునే ముందు మరోసారి. నిజానికి రాత్రి పూట ముఖం కడుక్కోకపోవడం వల్ల రోజంతా దుమ్ము ముఖంపైనే ఉంటుంది. దీనివల్ల మొటిమలు, మచ్చల సమస్య మొదలవుతుంది. అందుకే రాత్రి పడుకునే ముందు ఒకసారి ఫేస్‌వాష్ చేసుకోవాలి. తద్వారా చర్మం లోపలి నుంచి దెబ్బతిన్న కణాలను తొలగిస్తుంది. అంతేకానీ రోజులో చాలాసార్లు ముఖం కడుక్కోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories