AC Temperatures: ఏసీ వాడుతున్నారా? ఉష్ణోగ్రతలు ఎలా ఉండాలో తెలుసా? లేదంటే డేంజర్ జోన్‌లోకే..!

Air Conditioner Room Temperature for Better Sleep According to Doctors
x

AC Temperatures: ఏసీ వాడుతున్నారా? ఉష్ణోగ్రతలు ఎలా ఉండాలో తెలుసా? లేదంటే డేంజర్ జోన్‌లోకే..!

Highlights

AC Temperatures: పెరుగుతున్న వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు, కూలర్‌లను ఆశ్రయిస్తున్నారు.

AC Temperatures: పెరుగుతున్న వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు, కూలర్‌లను ఆశ్రయిస్తున్నారు. కూలర్‌తో పోలిస్తే కొన్ని నిమిషాల్లో గదిని చల్లబరచడంలో ఏసీ ఎంతో సహాయపడుతుంది. కానీ, చాలా మంది అధిక వేడి కారణంగా ఏసీ ఉష్ణోగ్రతను బాగా తగ్గించుకుంటారు. ఈ కారణంగా చలి, వేడి వంటి సమస్యలకు గురవుతుంటారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల కారణంగా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను పొందేందుకు రాత్రి పూట మంచి నిద్ర చాలా అవసరం.

శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. బెడ్‌రూమ్‌లో ఏసీని ఇన్‌స్టాల్ చేసి ఉంటే, మీ గది ఉష్ణోగ్రతను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా బాగా నిద్రపోవచ్చు. కాబట్టి మంచి నిద్ర కోసం మీ గది ఉష్ణోగ్రత ఎంత ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వైద్యుల ప్రకారం, ప్రశాంతమైన నిద్ర కోసం గది ఉష్ణోగ్రత 18.3 డిగ్రీల సెల్సియస్‌లో ఉంచాలి. మీ సౌలభ్యం ప్రకారం కొంచెం తక్కువ లేదా కొంచెం ఎక్కువ ఉంచుకోవచ్చు. అయితే, చాలా మంది వైద్యులు మాత్రం గది ఉష్ణోగ్రతను 15.6 నుంచి 19.4 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉంచితేనే గాఢ నిద్రకు ఉత్తమం అని చెబుతుంటారు. ఇది శరీరానికి అత్యంత సౌకర్యవంతమైన అనుభూతిని ఇస్తుందంట. సాయంత్రం తర్వాత సాధారణ ఉష్ణోగ్రత తగ్గుదలకు మన శరీరం అలవాటుపడుతుంది. అందువల్ల, బయటి ఉష్ణోగ్రత నుంచి గది ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా, శరీరానికి నిద్రపోయే సమయం వచ్చిందంటూ సందేశాన్ని ఇవ్వవచ్చు.

గది ఉష్ణోగ్రత నిద్రను ఎలా ప్రభావితం చేస్తుంది?

ఏసీ ఆన్ చేసినా చాలా మందికి రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టక ఇబ్బందులు పడుతుంటారు. రాత్రి పడుకునే ముందు శరీరం చల్లబడటం ప్రారంభించడం వల్ల ఇది జరుగుతుంది. శీతలీకరణ ప్రక్రియ ఉదయం 5 గంటలకు కనిష్ట ఉష్ణోగ్రతకు చేరుకునే వరకు కొనసాగుతుంది. దీని కోసం, మీరు పడుకునే ముందు మీ గది ఉష్ణోగ్రతను శరీరానికి అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. చర్మం కింద ఉండే రక్తనాళాల పెరుగుదల కారణంగా, శరీరం చల్లగా మారుతుంది. రాత్రి నిద్రిస్తున్నప్పుడు గది ఉష్ణోగ్రత చాలా వేడిగా లేదా చల్లగా ఉంటే, అది మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. ఇది శరీరం అంతర్గత ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుంది. చల్లని గది మీ శరీరాన్ని రాత్రంతా ప్రశాంతంగా నిద్రించడానికి సహాయపడేలా చేస్తుంది.

ఇక పిల్లలు నిద్రించేటప్పుడు మందపాటి దుప్పట్లు లేదా మెత్తని బొంతలు వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లల శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకోవచ్చంట. అలాగే పిల్లలు నిద్రించే ముందు వారి పొత్తికడుపు, మెడ వెనుక తాకి శరీర ఉష్ణోగ్రత ఎలా ఉందో చెక్ చేసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories