Cancer Risk: ఈ వయసు తర్వాత క్యాన్సర్‌ ముప్పు ఎక్కువ.. నివారణ మార్గాలు తెలుసుకోండి..!

After the Age of 50 the Risk of Cancer is High Know the Prevention Methods
x

Cancer Risk: ఈ వయసు తర్వాత క్యాన్సర్‌ ముప్పు ఎక్కువ.. నివారణ మార్గాలు తెలుసుకోండి..!

Highlights

Cancer Risk: క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన వ్యాధి.

Cancer Risk: క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన వ్యాధి. దీనిపేరు వింటేనే ప్రజలు వణికిపోతారు. క్యాన్సర్ గురించి ప్రజలకు పెద్దగా తెలియకపోవడమే దీనికి కారణం. సరైన సమయంలో క్యాన్సర్ లక్షణాలను గుర్తిస్తే దీనిని నయం చేయడం చాలా సులభం. కానీ దీని లక్షణాలు తెలుసుకునే సమయానికి వ్యాధి ముదిరిపోతుంది. అందుకే నిపుణులు తరచుగా క్యాన్సర్ లక్షణాలపై ఒక కన్ను వేసి ఉంచాలని సూచిస్తారు.

ఒక వ్యక్తి క్యాన్సర్‌ను గుర్తించకపోతే చివరికి మరణిస్తాడు. క్యాన్సర్ శరీరంలోని ఏ భాగానికైనా సోకుతుంది. వయస్సుతో పాటు క్యాన్సర్‌ ప్రమాదం కూడా పెరుగుతుంది. చెడు ఆహారపు అలవాట్లు, సిగరెట్లు, పొగాకు, మద్యం వంటి కొన్ని అలవాట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి. కాలేయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, సివిల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, నోటి క్యాన్సర్ అంటూ చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి.

చాలా మంది ప్రజలు ఈ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. క్యాన్సర్లలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి తక్కువ గ్రేడ్, మరొకటి ఎక్కువ గ్రేడ్. తక్కువ గ్రేడ్ క్యాన్సర్లు నెమ్మదిగా వ్యాప్తి చెందుతాయి. అయితే ఎక్కువ గ్రేడ్ క్యాన్సర్లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. హై గ్రేడ్ క్యాన్సర్‌లో మరణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 50 ఏళ్ల తర్వాత క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు నిర్ధారించారు. ఈ వ్యాధి ఏ వయసు వారికైనా రావచ్చు. అయితే కొంతమందికి జన్యుపరమైన కారణాల వల్ల వస్తుంది.

క్యాన్సర్‌కు ఖచ్చితమైన చికిత్స

క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా రోగి ప్రాణాలను కాపాడవచ్చు. కేన్సర్‌ ఒక చోటకే పరిమితమైతే సర్జరీ ద్వారా చికిత్స చేయవచ్చు కానీ ఎక్కువ భాగం వ్యాపిస్తే కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి అనేక పద్ధతులను అవలంబిస్తారు. కేన్సర్‌ బారిన పడిన రోగి వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకుంటే అతడి ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఆలస్యం మరణ ప్రమాదాన్ని పెంచుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories