Health Tips: మందుబాబులకి అలర్ట్‌.. లివర్‌ డ్యామేజ్‌ కావొద్దంటే ఈ సూపర్‌ ఫుడ్స్‌ బెస్ట్‌..!

Add these superfoods to your Diet to Prevent Liver Damage from Alcohol
x

Health Tips: మందుబాబులకి అలర్ట్‌.. లివర్‌ డ్యామేజ్‌ కావొద్దంటే ఈ సూపర్‌ ఫుడ్స్‌ బెస్ట్‌..!

Highlights

Health Tips: ఆధునిక యుగంలో ఒత్తిడి వల్ల చాలామంది ఆల్కహాల్‌కి బానిసలుగా మారుతున్నారు. దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి.

Health Tips: ఆధునిక యుగంలో ఒత్తిడి వల్ల చాలామంది ఆల్కహాల్‌కి బానిసలుగా మారుతున్నారు. దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా లివర్‌పై చాలా ఎఫెక్ట్‌ పడుతుంది. అంతేకాకుండా మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకి గురవుతున్నారు. పదే పదే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్‌ డ్యామేజ్‌ ఎక్కువగా జరుగుతుంది. ఇది లివర్‌ ఫెయిల్యూర్‌కి దారి తీస్తుంది. దీనిని నివారించాలంటే ఈ చెడు అలవాటుని మానుకోవాలి. అలాగే డైట్‌లో కొన్ని రకాల సూపర్‌ఫుడ్స్‌ని చేర్చుకోవాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఆహారంలో ఎక్కువగా ఫైబర్‌ ఉండే వాటిని తీసుకోవాలి. ఇందుకోసం వోట్మీల్ బెటర్. ఇందులో ఫైబర్‌ పుష్కలంగా లభిస్తుంది. ఈ పోషకాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. టిఫిన్‌గా వోట్‌మీల్‌ తినవచ్చు. అలాగే రోజుకు రెండు సార్లు గ్రీన్ టీ తాగితే లివర్ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. అయితే గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోకూడదని గుర్తుంచుకోండి లేదంటే లాభానికి బదులు నష్టమే జరుగుతుంది.

నిత్యం ఆకు కూరలు తింటే శరీరం మొత్తానికి అలాగే లివర్‌కి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి తోటకూర, పాలకూర, బచ్చలికూర, క్యాబేజీలని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా ద్రాక్ష పండ్లు తినాలి. ఇలా చేయడం వల్ల కాలేయం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. మళ్లీ యధావిధిగా తనపని తాను చేసుకుంటుంది. అలాగే కొన్ని ఆహారాలకి దూరంగా ఉండాలి. వేయించిన ఆహారాలు, కొవ్వు ఎక్కువగా ఉండే మాంసం వంటి ఆహారాలకి దూరంగా ఉండాలి. వీటివల్ల కాలేయం బలహీనపడుతుంది. అలాగే ఆరోగ్యకరమైన వంట నూనెలను మాత్రమే ఉపయోగించాలి. ఇందులో ఆలివ్ ఆయిల్ బెస్ట్‌ అని చెప్పవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories