Lifestyle: రెడ్‌మీట్ తింటే ఆ సమస్య తప్పదు.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు

According to latest study eating red meat may leads to type 2 diabetes
x

Lifestyle: రెడ్‌మీట్ తింటే ఆ సమస్య తప్పదు.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు

Highlights

ప్రతిరోజూ 50 గ్రాముల ప్రాసెస్ చేసిన మాంసం, 100 గ్రాముల పౌల్ట్రీ (కోడి మాంసం) తినే వ్యక్తులు టైప్ 2 డయాబెటిస్‌ను అభివృద్ధి చేసే ప్రమాదం ఉందని కనుగొన్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా భారతీయుల్ల డయాబెటిస్‌ బారిన ఎక్కువగా పడుతున్నారు. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, జీవనశైలి కారణంగా షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే షుగర్‌ వ్యాధి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయన్న విసయం మనకు తెలిసిందే. అయితే రెడ్‌మీట్ తీసుకోవడం వల్ల కూడా డయాబెటిస్‌ వచ్చే అకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

రెడ్ మీట్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ పెరుగుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ అధ్యయనంలో 20 దేశాలకు చెందిన 19 లక్షల మందికి పైగా డేటాను పరిగణలోకి తీసుకున్నారు. తరచూ రెడ్ మీట్ తినేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఫలితాల్లో తేలింది. "ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ" జర్నల్‌లో ఈ విషయాలను ప్రచురించారు.

ప్రతిరోజూ 50 గ్రాముల ప్రాసెస్ చేసిన మాంసం, 100 గ్రాముల పౌల్ట్రీ (కోడి మాంసం) తినే వ్యక్తులు టైప్ 2 డయాబెటిస్‌ను అభివృద్ధి చేసే ప్రమాదం ఉందని కనుగొన్నారు. ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం 15% పెరుగుతుంది, అయితే ప్రాసెస్ చేయని రెడ్ మీట్ 10%, పౌల్ట్రీ ప్రమాదాన్ని 8% పెంచుతుందని అధ్యయనంలో తేలింది. అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, మెక్సికో వంటి దేశాల శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది రెడ్ మీట్‌ను అధికంగా తీసుకుంటారని, ఇది టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకుల అభిప్రాయపడుతున్నారు.

ప్రాసెస్ చేసిన మాంసానికి బదులుగా ప్రాసెస్ చేయని రెడ్ మీట్ లేదా పౌల్ట్రీని తీసుకుంటే, మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కొంతమేరకు తగ్గించవచ్చని తేలింది. మరీ ముఖ్యంగా సమతుల్యమైన ఆహారాన్ని భాగం చేసుకోవడం వల్ల డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కచ్చితంగా వాకింగ్‌తోపాటు, చిన్న చిన్న వ్యాయామాలను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories