Health Tips: ఈ ఆహారాలు చర్మ సమస్యలని మరింత పెంచుతాయి.. కారణం ఏంటంటే..?

According to Ayurveda These Foods can Aggravate Skin Problems
x

Health Tips: ఈ ఆహారాలు చర్మ సమస్యలని మరింత పెంచుతాయి.. కారణం ఏంటంటే..?

Highlights

Health Tips: జీవనశైలిలో మార్పులు, చెడు అలవాట్ల వల్ల చాలామంది రకరకాల చర్మవ్యాధులకి గురవుతున్నారు.

Health Tips: జీవనశైలిలో మార్పులు, చెడు అలవాట్ల వల్ల చాలామంది రకరకాల చర్మవ్యాధులకి గురవుతున్నారు. చిన్న వయసులోనే ముసలివారిలా కనిపిస్తున్నారు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, ధూమపానం చేయడం వంటి కారణాలతో పాటు తినే తిండిపై కూడా ఎవ్వరూ దృష్టి సారించడం లేదు. దీనివల్ల చర్మ సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తోంది. వాస్తవానికి చర్మ సమస్య ఏర్పడినప్పుడు కొన్ని పదార్థాలకి దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి సమస్యని మరింత జఠిలం చేస్తాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. మసాలా దినుసులు

ఎర్ర కారం, గరం మసాలా, చాట్ మసాలా వంటి మసాలా దినుసులు ఆహారం రుచిని పెంచుతాయి. అయితే అదే సమయంలో చర్మానికి హాని కలిగిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం మితిమీరిన కారంగా లేదా ఉప్పగా ఉండే ఆహారం చర్మానికి హానికరం.

2. పులుపు తినడం

ఆయుర్వేదం ప్రకారం చర్మ సమస్యలు ఏర్పడినప్పుడు పులుపు పదార్థాలకి దూరంగా ఉండాలి. దీనివల్ల శరీరంలో పిత్తదోషం పెరుగుతుంది. రక్తం కలుషిత మవుతుంది. ఇది చర్మ సమస్యలను మరింత పెంచుతుంది.

3. పాల ఉత్పత్తులు

చర్మ సమస్యలు ఏర్పడినప్పుడు పాల ఉత్పత్తులకి దూరంగా ఉండాలి. నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే పాల ఉత్పత్తులు తీసుకోవాలి. ఒక పరిశోధన ప్రకారం పాల ఉత్పత్తులు హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా మొటిమల సమస్య మొదలవుతుంది.

4. గ్లూటెన్ నివారించండి

గ్లూటెన్ ఒక రకమైన ప్రోటీన్. ఇది గోధుమ, బార్లీలో కనిపిస్తుంది. చర్మ సమస్యలలో వీటిని తీసుకోవడం వల్ల పేగులు దెబ్బతింటాయి. దీని వల్ల చర్మంలో దురదతో పాటు దద్దుర్ల సమస్య ఏర్పడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories