Health Tips: రాత్రి సమయంలో పరోటా తినేవారికి హెచ్చరిక..!

A warning to those who eat parota at night as it invites various diseases
x

Health Tips: రాత్రి సమయంలో పరోటా తినేవారికి హెచ్చరిక..!

Highlights

Health Tips: రాత్రిపూట ఉద్యోగాలు, ప్రయాణం చేసేవారు హోటళ్లలో ఎక్కువగా పరోటా ఆర్డర్‌ చేస్తారు. ఇది తినడానికి రుచిగా ఉంటుంది కానీ తర్వాత హాస్పిటల్‌ వెళ్లాల్సి వస్తుంది.

Health Tips: రాత్రిపూట ఉద్యోగాలు, ప్రయాణం చేసేవారు హోటళ్లలో ఎక్కువగా పరోటా ఆర్డర్‌ చేస్తారు. ఇది తినడానికి రుచిగా ఉంటుంది కానీ తర్వాత హాస్పిటల్‌ వెళ్లాల్సి వస్తుంది. తరచుగా పరోటా తినేవారికి మధుమేహం పొంచి ఉంది. పరోటా తినొద్దని చెప్పేముందు ఇది దేనితో తయా రవుతుందో తెలుసుకోవడం అవసరం. పరోటాను మైదా పిండితో తయారుచేస్తారు. పిండిల్లో కల్లా అత్యంత ప్రమాదకరమైన పిండి మైదా. దీని వల్ల కలిగే నష్టాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

గోధుమ పిండిని ప్రాసెస్ చేసి అందులో నుంచి ఊక, ఎండోస్పెర్మ్ తొలగిస్తారు. అంటే అందులోని పీచుపదార్థాలు, పోషకాలు అన్నీ తొలగిపోతాయి అది మైదాపిండిగా మారుతుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని పెంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కలిగిస్తుంది. శరీరంలో మధుమేహాన్ని కలిగించే ప్రధాన కారకం మైదా. 100 గ్రాముల మైదాలో 351 కేలరీలు ఉంటాయి. ఇందులో 10.3 గ్రాముల ప్రొటీన్, 0.7 గ్రాముల కొవ్వు, 2.76 గ్రాముల పీచు, 74.27 గ్రాముల పిండిపదార్థాలు ఉంటాయి. ఈ పీచు లేని మైదాను తక్కువ తిన్నా వెంటనే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.

అంతేకాదు పరోట అధిక పిండితో మందంగా తయారుచేస్తారు. ఇందులోని పిండి ఉడకడానికి ఎక్కువ నూనె వేస్తారు. దీనివల్ల కూడా ఆరోగ్యానికి హాని పొంచి ఉంది. అధిక నూనె వల్ల కొవ్వు పెరిగి శరీర బరువు పెరుగుతుంది. గుండెపై ప్రభావం చూపుతుంది. ఇవి అంత సులభంగా జీర్ణం కావు. మైదా మలబద్ధక సమస్యను కలిగిస్తుంది. బాడీలో క్యాల్షియం బయటకు వెళ్లిపోయి ఎముకల సాంద్రత తగ్గుతుంది. రాత్రిపూట మెత్తగా చేసిన మైదా తింటే తేలికగా జీర్ణం కాదు. శారీరక శ్రమ లేకుండా తిని నిద్రపోతే నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి దీనికి దూరంగా ఉండటం మంచిది. డయాబెటీస్‌ పేషెంట్లు దీని జోలికి అస్సలు పోకూడదని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories