Health Tips: రోజుకి ఒక గ్లాస్‌ ఎండు అల్లం వాటర్.. ఈ వ్యాధులకి దివ్య ఔషధం..!

A Glass of Dry Ginger Water a Day Divine Medicine for These Diseases
x

Health Tips: రోజుకి ఒక గ్లాస్‌ ఎండు అల్లం వాటర్.. ఈ వ్యాధులకి దివ్య ఔషధం..!

Highlights

Health Tips: ఎండు అల్లంలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, సోడియం, విటమిన్లు ఎ, సి, జింక్, ఫోలేట్ యాసిడ్, ఫ్యాటీ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి.

Health Tips: ఎండు అల్లంలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, సోడియం, విటమిన్లు ఎ, సి, జింక్, ఫోలేట్ యాసిడ్, ఫ్యాటీ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని ఎక్కువగా ఆయుర్వేదంలో వినియోగిస్తారు. ఎండు అల్లం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎండు అల్లం ప్రభావం వేడిగా ఉంటుంది కాబట్టి చలికాలంలో శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుంది.

ఎండు అల్లం తీసుకోవడం వల్ల చలి వంటి సమస్యలను నివారించవచ్చు. అంతే కాదు జలుబు కారణంగా మీ గొంతులో పేరుకుపోయిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది. చలికాలంలో కీళ్ల నొప్పులకు ఉపశమనం కలిగిస్తుంది. అల్లం నీటిని తీసుకున్న తర్వాత బరువు వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది. జలుబు, ఫ్లూ నివారించడానికి పొడి అల్లం నీటిని సగానికి తగ్గించే వరకు మరిగించి తాగితే ఉపశమనం లభిస్తుంది.

మీకు కడుపు నొప్పి లేదా విరేచనాలు ఉంటే గోరువెచ్చని నీటిలో ఎండు అల్లం పొడిని వేసి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడుతుంటే గోరువెచ్చని నీటితో ఎండు అల్లం పొడిని వేసి తీసుకోవాలి. ఆకలి తక్కువగా అనిపిస్తే ఎండిన అల్లం పొడిని రాక్ సాల్ట్‌లో కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. పొడి అల్లం జలుబు, ఫ్లూ వంటి సమస్యలలో తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. కడుపులో గ్యాస్ ఏర్పడే సమస్య ఉంటే పొడి అల్లం తీసుకోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గొంతులో కఫం ఉంటే ఎండు అల్లం దివ్యౌషధం అని చెప్పవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories