నాకు నచ్చింది, వచ్చింది చేస్తాను. నాలోని ప్రతిభను ప్రదర్శిస్తాను. కొత్తగా ఆలోచిస్తాను ఇదీ నేటి యువత తీరు. సోషల్ మీడియా వేదికగా నటనలో దుమ్ము...
నాకు నచ్చింది, వచ్చింది చేస్తాను. నాలోని ప్రతిభను ప్రదర్శిస్తాను. కొత్తగా ఆలోచిస్తాను ఇదీ నేటి యువత తీరు. సోషల్ మీడియా వేదికగా నటనలో దుమ్ము దులిపేస్తున్నారు కొందరు. తమ నటన, డ్యాన్సులతో లక్షల్లో ఫ్యాన్స్‌ను సంపాదించుకుంటున్నారు. అందరూ ఒకప్పుడు డబ్‌స్మాష్‌లు చేయగా ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం టిక్‌టాక్‌తో మారుమోగుతోంది. ఇప్పుడు ఈ టిక్‌టాక్ విషయంలోనే ఓ భార్యను తన భర్తే హత్య చేసిన ఘటన కోవైలో చోటుచేసుకుంది. తమిళనాడు అన్నానగర్ కోవై సమీపం అరివొలినగర్‌కు చెందిన కనకరాజ్ (35) సదాసీదా కూలీ చేసుకొని జీవనం సాగిస్తుంటాడు. ఇతని భార్య నందిని (28)ఓ ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలో పనిచేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కాగా కుటుంబ తగాదాల కారణంగా కనకరాజ్, నందిని గత రెండేండ్లుగా విడివిడిగా ఉంటున్నారు. అయితే ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా నందినీ టిక్ టాక్ వీడియోస్ చేయడం మొదలు పెట్టింది. అయితే, నందిని టిక్‌టాక్‌లో అసభ్య హావభావాలు చూపుతూ పలు వీడియోలు పోస్ట్ చేస్తోంది. ఇది తెలుసుకున్న కనకరాజు గురువారం తన భార్య నందినికి ఫోన్ చేసి టిక్ టాక్ యాప్ లో వీడియోలు అప్లోడ్ చేయవద్దని, మళ్లీ తనతో కాపురానికి రావాలని కోరాడు. ఈ విషయంపై నందినికి ఫోన్ చేశాడు. ఈ సమయంలో నందిని ఫోన్ ఫుల్ బీజీ రావడంతో తీవ్ర ఆగ్రహానిలోనైనా కనకరాజ్ నందిని పనిచేస్తున్న కాలేజీకి వెళ్లి గొడవపడ్డాడు. మాట మాట పెరిగి కోపంలో కనకనరాజ్ తెచ్చుకున్న కత్తితో భార్యను పొడిచాడు దీంతో నందిని అక్కడిక్కడే మృతి చెందింది. వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టానికి పంపారు. అనంతరం కేసునమోదు చేసుకున్న పోలీసులు కనకరాజ్ ని అరెస్ట్ చేశారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire