ఆదివాసీలకు గులాబీ పార్టీపై కోపం ఎందుకు వచ్చింది..?

ఆదివాసీలకు గులాబీ పార్టీపై కోపం ఎందుకు వచ్చింది..?
x
Highlights

యాభై ఏడేళ్లకు ఆసరా ఫించన్, రైతు బంధు పథకం, పెళ్లిళ్లు భారం కాకుండా కళ్యాణ లక్ష్మి మూడు దశాబ్ధాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు పోటీ అందులోనూ అధికార పార్టీ...

యాభై ఏడేళ్లకు ఆసరా ఫించన్, రైతు బంధు పథకం, పెళ్లిళ్లు భారం కాకుండా కళ్యాణ లక్ష్మి మూడు దశాబ్ధాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు పోటీ అందులోనూ అధికార పార్టీ అభ్యర్థి అయినా ఆదివాసీలు పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు నగేష్ ను ఓడించారు...? ఆదివాసీలకు గులాబీ పార్టీపై కోపం ఎందుకు..? పార్టీని ఓడించడానికి కారణాలు ఏంటి..?

ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 3లక్షలకు పైగా ఆదివాసీ ఓటర్లు ఉన్నారు ఇక్కడ గెలుపోటములు కూడా వారే డిసైడ్ చేస్తారు దీంతో గత ఎన్నికలలో విజయం సాధించిన ఎంపీ నగేష్‌ను టీఆర్ఎస్ మరోసారి బరిలోకి దించింది. ఈ సారి కూడా నగేష్ భారీ విజయం సాధిస్తారని అంతా అంచనా వేసినా ఫలితం మాత్రం తారుమారైంది. బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు చేతిలో నగేష్ 58 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు దీంతో అధికార పార్టీ నేతలు ఈ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు.

ఆదిలాబాద్ పార్లమెంటులో మూడు ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా ఆదివాసీలు టీఆర్ఎస్‌కు ఓటు వేయడానికి మొగ్గు చూపలేదు ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే రేఖ నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి 30వేల 418 ఓట్లు వస్తే బీజేపీకి 47వేల320 ఓట్లు వచ్చాయి ఇక నగేష్ సొంత నియోజకవర్గం బోథ్. ఇక్కడ రాథోడ్ బాపూరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బోథెలో టీఆర్ఎస్‌కు 47 వేల 480 ఓట్లు వస్తే బీజేపీకి రికార్డు స్థాయిలో 61 వేల 094 ఓట్లు వచ్చాయి.

అసిఫాబాద్ నియోజకవర్గంలో అత్రం సక్కు టిఅర్ఎస్ లో చేరిన తర్వాత గులాబీ పార్టీ 50వేల మెజార్టీ సాధిస్తామని అంచనా వేసింది కానీ టీఆర్ఎస్‌కు 47వేల 401 ఓట్లు రాగా బీజేపీకి 44 వేల 874ఓట్లు పోలయ్యాయి మిగతా నాలుగు నియోజకవర్గాల్లోనూ ప్రతి నియోజకవర్గంలో ఆదివాసీల ఓట్లు ఇరవై వేలకు పైగానే ఉన్నా ఆ ఓట్లు కారు పార్టీకి దక్కలేదు దీంతో అధికార పార్టీ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని టీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆదివాసీలు ఏడాదిన్నర క్రితం పలు సమస్యలపై రెండు నెలల పాటు ఉద్యమం చేశారు అప్పుడు తెలంగాణ సీఎస్ సికే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్కారు చర్చలు జరిపి. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకూ వాటికి మోక్షం కలగలేదు దీంతో ఆదివాసీలు సర్కారు తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. దీని ప్రభావం వల్లే నగేష్ ఓటమిని చవిచూడన్న వాదన వినిపిస్తోంది ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని స్థానిక అధికార పార్టీ నేతలు కోరుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories