Bigg Boss 4 Telugu: వీరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు?
బిగ్ బాస్ సీజన్ 4 సెకండ్ వీక్ లో 9మంది నామినేషన్స్‌లో ఉన్నారు. ఈ తొమ్మిది మందిలో ఒకరు బిగ్ హౌస్ నుంచి వెళ్లిపోక తప్పదు. మరీ వీరిలో ఎవరు...
బిగ్ బాస్ సీజన్ 4 సెకండ్ వీక్ లో 9మంది నామినేషన్స్‌లో ఉన్నారు. ఈ తొమ్మిది మందిలో ఒకరు బిగ్ హౌస్ నుంచి వెళ్లిపోక తప్పదు. మరీ వీరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ప్రేక్షకులు ఎవరికి అనుకూలంగా ఉన్నారు? ఎవరికి ప్రతికూలంగా మారారు. సేఫ్ అయ్యేదెవరు బిగ్ హౌస్ నుంచి వెళ్లిపోయేదెవరు.
గత సీజన్లలో ఎప్పుడూ లేని విధంగా సెకండ్ ఫీక్ లో తొమ్మది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. గంగవ్వ, నోయల్, కరాటే కల్యాణి, మొనాల్ గజ్జర్, సొహైల్, అమ్మా రాజశేఖర్ కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్ నామినేట్ లిస్ట్ లో ఉన్నారు. అయితే తొలివారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యి అత్యధిక ఓట్లు రాబట్టిన గంగవ్వ వరుసగా రెండో వారం నామినేషన్లలో నిలిచింది. ఇక అభిజిత్ కూడా వరుసగా రెండో వారం నామినేషన్‌లో ఉన్నారు.
గతవారం రోజుల ఆట చూస్తూ.. కొరియోగ్రాఫర్ రాజశేఖర్ మాస్టర్ ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. సో.. రెండో వారంలో రాజశేఖర్ మాస్టర్ సేఫ్ కావడం ఖాయమే. ఇక గంగవ్వ లేని బిగ్ బాస్ హౌస్‌ని ఊహించుకోవడం కష్టమే.. తన యాస భాషలతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని ఇస్తోంది. గత వారం నామినేషన్‌లో ఉన్న గంగవ్వకు యాభై శాతం ఓట్లు పడ్డాయంటే గంగవ్వ హవా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సో గంగవ్వ ఎన్ని వారాలు నామినేషన్‌లో ఉన్నా ఆమె గట్టెక్కడం ఖాయమే. మూడో నామినేటెడ్ కంటెస్టెంట్ నోయల్ విషయానికి వస్తే ఓవర్ థింకింగ్ అనేది మనోడికి అతిపెద్ద మైనస్‌గా మారింది. అయితే తన ర్యాప్ సాంగ్స్ తో హౌస్ మెంబర్స్ లో ఫుల్ జోష్ పెంచుతున్నారు. సో నోయల్ కూడా సేఫ్ అవ్వడం గ్యారంటీ.
ఇక బిగ్ బాస్ పాతాళగంగా మొనాల్ గజ్జర్ విషయానికి వస్తే బోరు బోరున ఏడ్చి బోరుకట్టేలా చేస్తోంది. కానీ తన అందం, సెన్సివిటీతో తెలుగు ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అవుతుంది. పైగా రెండో వారంలో ఆమె కొత్త ట్రాక్ మొదలుపెట్టింది. ఇద్దరు కృష్ణుల ముద్దుల రాధగా అఖిల్-అభిజిత్-మొనాల్ మధ్య ట్రై యాంగిల్ కథ నడుస్తోంది. సో ప్రేక్షకుల ఓటింగ్ ఎలా ఉన్నా మొనాల్‌ని బిగ్ బాస్ హౌస్ నుంచి పంపే ప్రయత్నం ఇప్పట్లో అయితే చేయరు. ఇటు అఖిల్, అభిజిత్ కూడా సేఫ్ జోనులో ఉన్నట్లే. ఇక దేత్తడి హారికకు సోషల్ మీడియలో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా అంద చందాలతో కుర్రకారుకి మంచి కిక్ ఎక్కిస్తోంది. హౌస్‌లోనూ ఆమె పెర్ఫామెన్స్‌కి మంచి మార్కులే పడుతున్నాయి.
ఇక సొహైల్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పెర్ఫామెన్స్ పరంగా కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. ఇతన్నీ ప్రేక్షకులు ఇప్పుడే బయటకు పంపించే సాహాసం చేయరు. ఇక మిగిలింది కరాటే కల్యాణి, కుమార్ సాయి ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు దండిగానే కనిపిస్తున్నాయి. అయితే కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన రోజునే ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యాడు. సో ప్రేక్షకులు ఇతన్ని సేఫ్ చేసే చాన్సెస్ ఉన్నాయి. ఎటొచ్చీ ఈవారం కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హౌస్‌లో అందర్నీ కమాండ్ చేయడం తాను చెప్పిందే వేదం అన్నట్టుగా మాట్లాడటం ఇలాంటివి కల్యాణికి మైనస్ గా ఉన్నాయి. గత వారం నాగార్జున కూడా కల్యాణికి గట్టిగానే క్లాస్ పీకారు. ఈ అంశాలన్నింటిని చూస్తే రెండో వారంలో కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యే చాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire