తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు

తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు
x
Highlights

తెలుగు రాష్ట్రాలు నెత్తురోడాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలు అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. దర్మనానికి వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి...

తెలుగు రాష్ట్రాలు నెత్తురోడాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలు అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. దర్మనానికి వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురైన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కోదాడకు చెందిన కొంత మంది వ్యక్తులు ఆ మండలంలోనే ఉన్న తమ్మరబండపాలెంలో సీతారాముల కళ్యాణం చూసేందుకని వెళ్లారు. కళ్యాణం అనంతరం తిరిగి వస్తుండగా కోదాడ సమీపంలోని ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద వీరి ఆటో ప్రమాదానికి గురైంది. వీరి ముందు వెళ్లున్న వాహనాన్ని అధిగమించే యత్నంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఆటోలో ప్రయిణిస్తున్న వారిలో ఏడుగురు మృతి చెందారు. ఆటో నుజ్జునుజ్జయింది. స్థానికుల సాయంతో గాయపడ్డ వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నల్గొండ జిల్లాలోనే మరో ప్రమాదం చోటుచేసుకుంది. వేములపల్లి మండలం నార్కట్ పల్లి అద్దంకి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.మండల కేంద్రంలోని ఎం.ఆర్.వో కార్యాలయం సమీపంలో రెండు బైకులు ఢీకొన్నాయి. వేములపల్లి కి చెందిన 16 సంవత్సరాల పుట్టల మనోజ్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరిని చికిత్స కోసం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు మృతి చెందారు. వారి తల్లిదండ్రులకు స్వల్పగాయాలయ్యాయి. ఆగివున్న లారీని కారు ఢీకొనడంతో ఆర్మీ అధికారి ఇద్దరు కూతుళ్లు అక్కడికక్కడే మరణించారు. ఆర్మీ అధికారి పదోన్నతి పై హైదరాబాద్ నుండి కలకత్తా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోతున్న వారి సంఖ్య సరాసరి 41గా ఉంది. ఈ సంఖ్య ప్రతి ఏటా పెరగుతూ ఉండడం కఠోర వాస్తవం.

Show Full Article
Print Article
Next Story
More Stories