చందమామ ముడుచుకుపోతున్నాడట!

చందమామ ముడుచుకుపోతున్నాడట!
x
Highlights

అవును.. మీరు విన్నది నిజమే. నాసా ఈ విషయాన్ని చెబుతోంది. చందమామ క్రమేపి కుచించుకుపోతున్నాడని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా వెల్లడించింది...

అవును.. మీరు విన్నది నిజమే. నాసా ఈ విషయాన్ని చెబుతోంది. చందమామ క్రమేపి కుచించుకుపోతున్నాడని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా వెల్లడించింది వెల్లడించింది. అంతర్గతంగా ఉండే చల్లదనం, ఇతర కారణాల రీత్యా ఇలా జరుగుతోందని నాసా తన అధ్యయనంలో పేర్కొంది.

వందల మిలియన్ల సంవత్సరాల కాలంలో చంద్రుడు దాదాపు 150 అడుగులకంటే ఎక్కువగా కుంచించుకుపోయాడని వెల్లడించింది. దీని కారణంగా చంద్రుని ఉపరితలం ముడుచుకుపోవడం, ప్రకంపనలు చోటుచేసుకోవడంలాంటి పరిణామాలకు దారితీస్తాయని వివరించింది.

ఒక ద్రాక్ష ఎండు ద్రాక్షలాగా మారినట్లు.. చంద్రుడు కుంచించుకుపోతున్నట్లు నాసా పరిశోధకులు తెలిపారు. చంద్రునికి సంబంధించి లూనార్‌ రీకానిసెన్స్‌ ఆర్బిటార్‌ తీసిన 12 వేలకుపైగా చిత్రాలను విశ్లేషించి పరిశోధకులు ఈ విషయాన్ని నిర్ధారించారు. ద్రాక్షపై ఉన్న అనువైన చర్మంవలే కాకుండా.. చంద్రుని ఉపరితలం పెళుసుగా ఉంటుంది. చంద్రుడు కుంచించుకుపోతే ఈ ఉపరితలంపై పగుళ్లు ఏర్పడతాయి. మన భూమి అంతర్భాగంలో ఉన్నట్లు చంద్రుని అంతర్భాగంలో టెక్టోనిక్‌ ప్లేట్లు లేవు. అయితే 4.5 బిలియన్‌ ఏళ్ల క్రితం చంద్రుడు ఏర్పడిన నాటి నుంచి దాని అంతర్భాగంలోని వేడిమిని నెమ్మదిగా కోల్పోవడం ద్వారా చంద్రునిలో టెక్టోనిక్‌ ప్రక్రియ జరుగుతోంది. దీని ద్వారా జాబిల్లి ముడుచుకుపోవడం జరుగుతోందని పరిశోధకులు తేల్చారు. చంద్రుని ఉత్తరధ్రువం సమీపంలోని మారే ఫ్రిగోరిస్‌ ప్రాంతం పగుళ్లు ఏర్పడి ముందుకు కదులుతున్నట్లు తన పరిశోధనల్లో తేలినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories