దొంగతనానికి వచ్చిన దొంగ.. ఎమైనా సహయం చేయనా అంటూ యాజమాని..

దొంగతనానికి వచ్చిన దొంగ.. ఎమైనా సహయం చేయనా అంటూ యాజమాని..
x
Highlights

అర్థరాత్రి 2గంటలకు ఇంటి ముందు సెలార్‌లో పార్క్ చేసిన ఆడీ కారును ఓ దొంగ దొంగిలించడానికి ప్రయత్నించాడు. అయితే ఇక్కడ వింత ఏమిటి అంటే కారును...

అర్థరాత్రి 2గంటలకు ఇంటి ముందు సెలార్‌లో పార్క్ చేసిన ఆడీ కారును ఓ దొంగ దొంగిలించడానికి ప్రయత్నించాడు. అయితే ఇక్కడ వింత ఏమిటి అంటే కారును దొంగిలింద్దామని యత్నిస్తున్న దొంగకు ఆ కారు యజమాని షాక్ ఇచ్చాడు. లండన్‌లోని సిడెనాం ప్రాంతానికి చెందిన స్మిత్ బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆఫిసు నుండి వచ్చినా స్మిత్ తన కారును తన ఇంటి ముందు ఉన్న సిసి కెమెరాకు అలార్మ్ సెట్ చేసుకున్నాడు దీని ద్వారా తలుపు వద్దకు ఎవరైనా వస్తే వెంటనే స్మిత్‌ ఫోన్‌కు నోటిఫికేషన్ వెళ్తుంది.

అయితే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే స్మిత్ తన ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి కెమెరాను పరిశీలించగా అసలు అక్కడ దొంగ ఏం చేస్తున్నాడో ఏం అర్థం కాలేదు దీంతో వెంటనే తన ఇంటి ముందు ఉన్న అలార్మ్ ద్వారా స్మీత్ హాయ్, నేను హెల్ప్ చేయనా అంటూ మాట్లాడాడు. అంతే ఇక ఆ వాయిస్ విన్న దొంగ ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే హుటాహుటినా అక్కడి నుండి ఆ దొంగ పరార్ అయ్యారు. కాగా ఆ దొంగ తన 35లక్షలు విలువచేసే ఆడీ కారును దొంగిలించడానికే వచ్చుంటాడని స్మిత్ అనుమానం వ్యక్తం చేశాడు. పెరుగుతున్న జనభాతో పాటు టెక్నాలజీ రోజు రోజుకి అభివృద్ధి పథంలో అడుగులేస్తోంది. టెక్నాలజీ ద్వారా ఇంట్లో లేకుండానే దొంగలను కనిపెట్టే అవకాశం లభిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories