నేడు దుగ్గిరాల గోపాలకృష‌్ణయ్య జయంతి

నేడు దుగ్గిరాల గోపాలకృష‌్ణయ్య జయంతి
x
Highlights

పోరాట పురిటిగడ్డ చీరాల. చేనేతకు పుట్టినిల్లు. చైతన్యవంతులైన ఇక్కడి ప్రజలు స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకున్నారు. మహాత్మాగాంధీ సూచనతో ఆంధ్రరత్న దుగ్గిరాల...

పోరాట పురిటిగడ్డ చీరాల. చేనేతకు పుట్టినిల్లు. చైతన్యవంతులైన ఇక్కడి ప్రజలు స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకున్నారు. మహాత్మాగాంధీ సూచనతో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో పన్నుల నిరాకరణోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం దుగ్గిరాల గోపాలకృష‌్ణయ్య జయంతి సందర్బంగా ఆనాటి ఉద్యమాన్ని స్మరించుకుందాం. చీరాల ముద్దుబిడ్డ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కృష్ణా జిల్లా పెనుకంచిప్రోలులో జన్మించారు. స్వతంత్ర భావాలు కలిగిన గోపాలకృష్ణయ్య ఉద్యోగాన్ని వదులుకుని 1920లో స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు. ఈ క్రమంలో వెయ్యి మందితో శ్రీరామదండు సైన్యాన్ని ఏర్పాటు చేశారు. చీరాలను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రకటించింది. అప్పటి వరకు పంచాయతీ పరంగా రూ. 4వేలు ఉన్న పన్నును రూ. 40వేలకు పెంచింది. దీన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో మహాత్మాగాంధీ 1921 ఏప్రిల్ 6న చీరాల వచ్చారు. మున్సిపాలిటీ రద్దుకు పన్నుల బహిష్కరణ లేదా పుర బహిష్కరణకు పిలుపునిచ్చారు.

దుగ్గిరాల పిలుపు మేరకు 1921 ఏప్రిల్ 25న అర్ధరాత్రి పేరాల నుంచి రామ్ నగర్‌కు , చీరాల నుంచి పొలిమేరకు 13,572మంది తరలివెళ్లారు. ఒక్క పైసా కూడా పన్ను చెల్లించమని బ్రిటీష్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. మున్నిపాలిటీని రద్దు చేసి తిరిగి చీరాల , పేరాలను పంచాయతీలుగా చేయాలని డిమాండ్ చేశారు. దుగ్గిరాల పోరాట పటిమకు బ్రిటీష్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. మున్సిపల్ కౌన్సిల్‌ను రద్దు చేసి రుస్తుంసింగ్ ను తహశీల్దార్‌గా నియమించారు. 1928 జూన్ 10న ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య క్షయవ్యాధితో రామ్‌నగర్‌లో పరమపదించారు. దుగ్గిరాల స్మారకంగా ఆయన భౌతిక కాయాన్ని చీరాలలో ఊరేగించి ఆర్టీసీ గ్యారేజీ ప్రహరీ పక్కనున్న ప్రదేశంలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఆయన స్మారకార్థం ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పార్కును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి , చీరాలలోని ప్రధాన రహదారికి ఆయన పేరు పెట్టారు. ఆయన స్మారక కేంద్రం ఇంకా కార్యరూపం దాల్చలేదు. చీరాల ప్రజల తరపున పోరాటం చేసిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్మారక భవనం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories