యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం
x
Highlights

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. మానవత్వం మంటగలిసింది. వలిగొండలో దివ్యాంగ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాందుడు. సరిగా మాటలు...

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. మానవత్వం మంటగలిసింది. వలిగొండలో దివ్యాంగ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాందుడు. సరిగా మాటలు కూడా రాని యువతిపై మహేందర్ అనే వ్యక్తి అత్యాచారానికి వడిగట్టాడు. అయితే ఆ బాలిక ఇంటి పక్కనే ఉంటాడు మహేందర్. మే26 ఆదివారం నాడు యువతి తలిదండ్రులు పనికోసం బయటకు వెళ్లారు. ఇంట్లో ఒక్కతే ఉన్నదని గమనించిన మహేందర్ ఇదే సరైన సమయం అనుకున్న మహేందర్ ఇంట్లోకి ప్రవేశించి ఆ యువతిపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసకున్న గ్రామస్థులు నిందితుడిని శిక్షించాలంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిట్యాల-భువనగిరి రహదారిపై ధర్నాకు దిగారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటివరకూ స్పందించకపోవటం గమనించాల్సిన విషయం.

Show Full Article
Print Article
Next Story
More Stories