వనస్థలిపురం ఎటిఎం చోరి కేసులో దొంగలు వీరేనా?

వనస్థలిపురం ఎటిఎం  చోరి కేసులో దొంగలు వీరేనా?
x
Highlights

రాజధానిలో రాంజీ ముఠా 58 లక్షలు దోపిడీ చేసింది ఆ ముఠా పనేనని నిర్ధారించారు పోలీసులు. నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. రెక్కీ...

రాజధానిలో రాంజీ ముఠా 58 లక్షలు దోపిడీ చేసింది ఆ ముఠా పనేనని నిర్ధారించారు పోలీసులు. నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. రెక్కీ నిర్వహించి మరి దోపిడీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో ఎటిఎం మనీ చో్రీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సినీఫక్కీలో 58లక్షలు దోచుకెళ్లిన ముఠా కోసం 20టీంలు విస్తృతంగా గాలిస్తున్నాయి. నిందితుల కోసం ఐదు రాష్ట్రాలకు 8 బృందాలు వెళ్లాయి. తమిళనాడు తిరుచ్చికి చెందిన రాంజీనగర్ దొంగలముఠా పనేనని పోలీసులు నిర్దారించారు. ఈ చోరీలో 8 నుంచి 10మంది పాల్గొన్నట్లు గుర్తించారు. ఎటిఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిని కూడా పోలీసులు విచారించారు. వారి ముగ్గురి నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది.

దోపిడికి ముందు పక్కా రెక్కీ నిర్వహించారు దొంగలు. ఖానా ఖజానా హోటల్‌లో భోజనం చేసిన తర్వాత దోపిడీకి పాల్పడ్డారు. హోటల్‌ లో సిసి పుటేజీ లో నిందితుల కదలికలు రికార్డు అయ్యాయి. చోరీపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని క్లూస్ దొరికినప్పటికీ డబ్బులు అంతర్ రాష్ట్రాలకు చేరిపోయి ఉంటాయని అనుమానిస్తున్నారు. సిసి కెమెరాల పుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు సాగిస్తున్నారు.

దోపిడికి పాల్పడిన తర్వాత రెండు నుంచిమూడు ఆటోలు మారినట్లు సిసి ఫుటేజీ ద్వారా తెలుసుకున్నారు. ఎక్కడికి వెళ్లారు... ఎటు వైపు వెళ్లారనే కోణం దర్యాప్తు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వారు వెళ్లినట్లు కొన్ని ఆధారాలు లభించాయి. 58లక్షలు తీసుకుని ఇద్దరు ముఠా సభ్యులు తమిళనాడు వెళ్లినట్లు భావిస్తున్నారు. ఎవరికి ఎవరితో సంబంధం లేకుండా ఒక్కొక్కరు ఒక్కో రాష్ట్రానికి పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ కేసును కచ్చితంగా ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories