కాపులకు కల్లలుగానే మిగులుతున్న రాజ్యాధికారం

కాపులకు కల్లలుగానే మిగులుతున్న రాజ్యాధికారం
x
Highlights

ఏపీలో కాపులకు రాజ్యాధికారం సాధ్యమేనా..? కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు పెట్టే పార్టీలు అధికారంలోకి వస్తాయా..? రాష్ట్రంలో అత్యధిక జనాభా శాతం...

ఏపీలో కాపులకు రాజ్యాధికారం సాధ్యమేనా..? కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు పెట్టే పార్టీలు అధికారంలోకి వస్తాయా..? రాష్ట్రంలో అత్యధిక జనాభా శాతం ఉన్నా కులం ముద్ర కారణంగా సక్సెస్ కాలేకపోతున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొన్న ప్రజారాజ్యం, తాజాగా జనసేన పార్టీ ఎన్నికల్లో పరాజయం పాలవ్వడం ఆ వర్గాన్ని ఆందోళన కలిగిస్తోంది.

ఏపీలో అత్యధిక జనాభా శాతం ఉన్న సామాజికవర్గం కాపు. సుమారు 18 నుంచి 20 శాతం వరకూ ఓటర్లు ఆ సామాజిక వర్గానికి అండాదండ. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్ధేశించే స్థాయిలో జనాభా ఉన్నా రాజ్యాధికారం కల్లగానే మిగులుతోంది.

కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తులెవరైనా పార్టీ పెడితే దానికి కుల ముద్రవేయడం గత కొన్నేళ్లుగా సాగుతున్న పరిణామం. పార్టీ పెట్టిన వెంటనే ఆ సామాజికవర్గం జనహోరు బేజారు ఎక్కిస్తోంది. ఇంకెంత ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమైపోయిందన్నట్టుగా ఉంటుంది. కానీ, ఆఖరికి పరాజయంపాలై ఆ తర్వాత కనుమరుగవడం జరుగుతోంది. దీన్ని ఆ సామాజికవర్గం జీర్ణించుకోలేకపోతోంది.

తాజాగా జరిగిన ఎన్నికల్లో సైతం జనంతో ప్రభంజనంగా మారిన జనసేన పార్టీ బొక్కబోర్లా పడింది. ఒక్కసీటుతో సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ప్రధానంగా గోదావరి జిల్లాల్లో కాపు సామాజికవర్గం అత్యధికం. ఒక్క తూర్పుగోదావరిజిల్లాలో 42లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 4వ వంతు ఓటర్లు కాపు సామాజికవర్గానికి చెందిన వారే. దీంతో జిల్లాలో జనసేనకు కనీసం 5సీట్లు వస్తాయని భావించారు. కానీ, ఒక్క సీటు జనసేనకు దక్కింది. ఇక రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా గెలవకపోవడం ఆ వర్గానికి ఆందోళన కలిగించింది.

తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలుంటే 16 స్థానాల్లో కాపు సామాజికవర్గం అత్యధికం. ప్రతి నియోజవర్గంలోనూ సుమారు 40 నుంచి 50వేల ఓటర్లు ఉండటంతో గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉంటారు. అయినా జనసేన అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. మరి ఈ సామాజికవర్గం ఓట్లు ఏ పార్టీకి పోల్ అయ్యాయన్నది మిస్టరీగా మారింది.

కాపు ఉద్యమం పుట్టిన జిల్లాలో కాపు పార్టీగా ముద్రపడిన జనసేనకు కాపు జేఏసీ పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వలేకపోయింది. కాపు సామాజికవర్గానికి ఎంతో కొంత చేసిన చంద్రబాబును నమ్మకపోవడంతో వైసీపీ తరఫున పోటీ చేసిన కాపు అభ్యర్థులను ఏకంగా ఆరుగురిని గెలిపించారు. గతంలో ప్రజారాజ్యం తరఫున 18 స్థానాల్లో అభ్యర్థులు గెలిస్తే ఈ సారి జనసేన తరఫున ఒకరు గెలిచారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి మంది జనాభా ఆ సామాజికవర్గంలో ఉంటే జనసేనకు లభించిన ఓట్లు కేవలం 17లక్షలు. అందులో తూర్పుగోదావరి జిల్లాలో 5లక్షలకు పైగానే ఉన్నాయి. అయినా జనసేన పార్టీకి ఎలాంటి మేలు చేకూర్చలేదు. ఈ పరిణామాలన్నీ ప్రస్తుతం ఆ సామాజికవర్గాన్ని కలవరపెడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories