పాక్‌ డ్రోన్‌ పరార్‌

పాక్‌ డ్రోన్‌ పరార్‌
x
Highlights

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారంటూ ప్రపంచ దేశాలు పాకిస్ధాన్‌ను ఛీ కొడుతున్నా తీరు మార్చుకోవడం లేదు. శాంతి కల్పనే లక్ష్యంగా చేసుకున్న ఒప్పందాలను సైతం...

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారంటూ ప్రపంచ దేశాలు పాకిస్ధాన్‌ను ఛీ కొడుతున్నా తీరు మార్చుకోవడం లేదు. శాంతి కల్పనే లక్ష్యంగా చేసుకున్న ఒప్పందాలను సైతం ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడుతోంది. శాంతి సందేశం కోసమే భారతీయ పైలెట్‌ అభినందన్‌ను విడుదల చేశామంటూ మాటలు చెబుతూనే సరిహద్దుల వెంట భారతీయ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు దిగుతోంది. గడచిన 10 రోజుల్లో సరిహద్దు వ్యాప్తంగా మూడు వందల సార్లు పాకిస్ధాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వెంట పాక్ సైన్యం చేస్తున్న దాడులను భారత బలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి. నిన్న ఉదయం రాజస్ధాన్‌ హిందుమాల్‌కోటలోకి దూసుకొచ్చిన డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ జవాన్లు దానిపై కాల్పులు జరిపారు. దీంతో వెంటనే ఆ డ్రోన్‌ వెనక్కు మళ్లింది. కాగా, నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) సమీపంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. శాంతి సందేశం మాటల్లో వినిపిస్తూనే పదే పదే కాల్పులకు దిగడంపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాహటంగానే పాక్ తీరును తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories