మాయమవుతున్నాడమ్మ .... మనిషన్న వాడు అనే పాట .. సమాజంలో జరుగుతున్న ఘటనలకు సాక్షంగా నిలుస్తోంది. కామాంధుల ధాటికి అభం శుభం తెలియని చిన్నారులు నిత్యం...
మాయమవుతున్నాడమ్మ .... మనిషన్న వాడు అనే పాట .. సమాజంలో జరుగుతున్న ఘటనలకు సాక్షంగా నిలుస్తోంది. కామాంధుల ధాటికి అభం శుభం తెలియని చిన్నారులు నిత్యం ఎక్కడో ఒకచోట బలవుతూనే ఉన్నారు. తమకు తెలియకుండానే తనువు చాలిస్తున్నారు.
ఆడపిల్లగా పుట్టి తన జీవితానికి తానే మరణశాసనం చేసుకున్న ఈ చిన్నారి పేరు శ్రావణి . ఊరు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హజీపూర్. నేరం ఘోరం దుర్మార్గం అమానవీయం ఈ పదాలన్నీ ఈ చిన్నారిపై జరిగిన ఆకృతం ముందు చిన్నబోతాయి. మానవత్వాన్ని మంటగలుపుతూ కఠిన పాషాణ హృదయాలను సైతం కన్నీరు పెట్టించే అత్యంత విషాదకరమైన ఘటన ఈ చిన్నారి జీవితంలో చోటుచేసుకుంది.
నెల క్రితమే తొమ్మిదో తరగతి పూర్తి చేసుకుని పదో తరగతిలోని అడుగు పెట్టిన ఈ చిన్నారికి అమ్మ,నాన్న, అక్క, తమ్ముడు, స్నేహితులు చదువులే ప్రపంచం. ఆట, పాటలు, పుస్తకాలు తప్ప మరేది తెలియని పసి హృదయం చిన్నారి శ్రావణిది. సభ్యసమాజం సిగ్గుపడేలా కొందరు నరమాంస భక్షకులు ఈ చదువుల తల్లిని తమ కామదాహానికి బలిగొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హజీపూర్‌కు చెందిన శ్రావణి బుధవారం క్లాస్‌కు వెళ్లి సాయంత్రం అయినా తిరిగి రాలేదు. స్నేహితులు, బంధువుల ఇళ్లలో వాకబు చేసిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
గ్రామ పొలిమేర్ల వరకు బాలిక వచ్చిందని నిర్ధారించుకున్న పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్‌తో గాలించారు. సమీపంలోని పాడుబడ్డ బావిలో బాలిక శవాన్ని పాతిపెట్టినట్టు గుర్తించారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఖాళీ బీరు సీసాలు పడి ఉండటంతో జరగరానిది ఏదో జరిగినట్టు భావించి ఉన్నతాధికారులకు సమచారం ఇచ్చారు. ఇదే సమయంలో చిన్నారి శ్రావణిని చంపి పూడ్చి పెట్టినట్టు గ్రామంలో తెలియడం తీవ్ర కలకలం రేగింది.
ఊరు ఊరంతా ఏకమై పోలీసులపై తిరగబడింది. రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతున్నా కఠిన చర్యలు తీసుకోవడం లేదంటూ గ్రామస్తులు నిలదీశారు. శ్రావణిని హత్యచేసిన దుండగులు ఎవరో తెలిసే వరకు శవాన్ని బయటకు తీయనీయమంటూ పోలీసులకు అడ్డుతగిలారు. పోలీసుల వాహనం అద్దాలు పగులగొట్టి నిరసనకు దిగారు.
ఘటనా స్థలికి చేరుకున్న ఉన్నతాధికారులు శ్రావణి మృతదేహాన్ని వెలికి తీస్తేనే అసలు నిజం వెలుగు చూస్తుందంటూ నచ్చజెప్పారు. ఇప్పటికే తాము దర్యాప్తు చేపట్టామని నిందితులను పట్టుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో శ్రావణి శవాన్ని వెలికి తీశారు. బాలిక శరీరంపై ఉన్న గాయాలను బట్టి అత్యాచారం జరిగినట్టు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు.
బాలిక శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భువనగిరి ఆస్పత్రికి తరలించారు. తెలిసిన యువకులే ఈ ఘటనకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. శ్రావణి బస్సు దిగి వచ్చే సమయంలో ఈ ఘటనకు పాల్పడినట్టు గుర్తించారు. ఇప్పటికే క్లూస్ టీంను రప్పించిన పోలీసులు బీరు సీసాలతో పాటు చుట్టుపక్కల లభించిన ఆధారాలను సేకరిస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire