చర్చిల్లో పేలుళ్లు.. దద్దరిల్లిన కొలంబో

చర్చిల్లో పేలుళ్లు.. దద్దరిల్లిన కొలంబో
x
Highlights

శ్రీలంక రాజధాని కొలంబో వరుస బాంబు పేలుళ్లుతో అట్టుడికింది. ఈస్టర్ పర్వదినం సందర్భంగా ప్రార్ధనలు చేస్తున్న క్రైస్తవ సోదరులు, పర్యాటకులను లక్ష్యంగా...

శ్రీలంక రాజధాని కొలంబో వరుస బాంబు పేలుళ్లుతో అట్టుడికింది. ఈస్టర్ పర్వదినం సందర్భంగా ప్రార్ధనలు చేస్తున్న క్రైస్తవ సోదరులు, పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడులు జరిగాయి. నగరంలోని మూడు చర్చీలు, మూడు హోటళ్లలో నిమిషాల వ్యవధిలో బాంబు పేలుళ‌్లు జరిగాయి. ఈస్టర్ ప్రార్ధనలు నిర్వహిస్తుండగా బాంబు దాడులు జరిగినట్టు అధికారులు తెలియజేశారు. పేలుళ్లలో 80 మంది వరకు గాయపడినట్టు సమాచారం. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు కొలంబో విమానాశ్రయంలో అదనపు బలగాలను మోహరించారు. బాంబు పేలుళ్లు జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ పుటేజీని స్వాధీనం చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.






Show Full Article
Print Article
Next Story
More Stories