అతని కోరిక తీరింది.. తరువాత పొమ్మన్నాడు

అతని కోరిక తీరింది.. తరువాత పొమ్మన్నాడు
x
Highlights

ఆమె ఒక వివాహిత.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భార్యభర్తల మధ్య గోడవ రావడంతో ఇంటి నుండి బయటకు వచ్చి ఒంటరిగా బతుకుతోంది. రోజు దినసరి కూలీ చేసుకుంటు...

ఆమె ఒక వివాహిత.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భార్యభర్తల మధ్య గోడవ రావడంతో ఇంటి నుండి బయటకు వచ్చి ఒంటరిగా బతుకుతోంది. రోజు దినసరి కూలీ చేసుకుంటు కాలం ఎల్లదిస్తుంది ఆ మహిళ. అయితే ఒంటరిగా ఉన్న ఈ మహిళ జీవితంలోకి ఓ యువకుడు ఎంటర్ అయ్యాడు. నీకు ఎవరు లేవని బాధపడకు జీవితాంతం నీకు తోడు నీడగా ఉంటానంటూ ఆ మహిళకు మయమాటలు చెప్పి ఆ మహిళతో మొత్తానికి మొళ్లిగా స్నేహం ఏర్పడింది. అలా అలా ఆ మహిళతో ఆరేళ్ల పాటు భార్యాభర్తల్లా ఒకే ఇంట్లో కలిసి కాపురం చేశారు. అయితే అలా సాగుతున్న వారి ప్రయాణంలో పెళ్లి ప్రస్తావన వచ్చింది. తరచూ ఆ మహిళ పెళ్లి ప్రస్తావాన తీసుకొచ్చేది. అయితే ఆ యువకుడు ఆమె మాట దాటేసుకుంటూ తప్పుకుంటూ వచ్చాడు. ఇక ఆమెపై మోజు తీరాక పక్కను పెట్టి ఇంకో మహిళను పెళ్లి చేసుకోవాడానికి సిద్ధమయ్యాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళా నేరుగా పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయండంటూ వేడుకుంది. తనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం వర్రేగూడెంకు చెందిన యువకుడు ఎర్రంశెట్టి శివప్రసాద్‌. ఇతను ఓ ఆటో డ్రైవర్‌.రోజూ విజయవాడకు ఆటో ట్రిప్పులు వేస్తుంటాడు. అయితే ఈ క్రమంలోనే ఉయ్యూరుకు చెందిన మన్నె మాధవితో పరిచమైంది. భర్తతో మనస్పర్ధలు మాధవి ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఇంతలోనే వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారీ అది సహ జీవనానికి దారి తీసింది. దీంతో భర్త, తన పిల్లల్ని వదిలేసి ఆటో డ్రైవర్ ప్రసాద్‌తో తట్టబుట్ట సదురుకొని వచ్చేసింది.గొడుగుపేటలోని ఓ అద్దె ఇంట్లో వీరు సహ జీవనం సాగిస్తున్నారు. వివాహం ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి తప్పుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల హంసలదీవికి చెందిన మరో యువతిని పెళ్లి చేసుకునేందు్కు ప్రసాద్ రేడీ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మాధవి లాబోదిబోమని కొట్టుకుంది. హుటాహుటినా పోలీసు ఠాణాకు వెళ్లి అతని ఫిర్యాదు చేసి, తనకు న్యాయం చేయండి అంటూ వేడుకోంది. శివప్రసాద్‌పై కేసు నమోదు చేశారు.

అయితే మాధవి తన భర్త నుంచి విడాకులు తీసుకోకపోవటంతో పోలీసులు చేసేది లేదంటూ చెప్పారు. దీంతో పోలీసు ‎ఠాణాముందే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో శివప్రసాద్‌తో పాటు అతని తల్లిదండ్రులు, సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శివప్రసాద్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. మాధవి ఆత్మస్థైర్యం కోల్పోయినట్లు వ్యవహరిస్తుండటంతో పోలీసులు మాధవి ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించి కౌన్సెలింగ్‌ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories