ప్రేమించిన యువతి అన్నయ్య అన్నదని..

ప్రేమించిన యువతి అన్నయ్య అన్నదని..
x
Highlights

తన కంటే తాను ఇష్టపడిన అమ్మయినే ఎక్కవ ప్రేమించాడు ఓ యువకుడు అయితే తీరా తన ప్రేమించిన యువతి తనను అన్నయ్య అందని తను తీవ్రమస్తాపనికి గురై ఓ యువకుడు ఏకంగా...

తన కంటే తాను ఇష్టపడిన అమ్మయినే ఎక్కవ ప్రేమించాడు ఓ యువకుడు అయితే తీరా తన ప్రేమించిన యువతి తనను అన్నయ్య అందని తను తీవ్రమస్తాపనికి గురై ఓ యువకుడు ఏకంగా చెరువులోపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం హిమాయత్‌నగర్‌లో గురువారం జరిగింది. పోలీసు ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌ గ్రామానికి చెందిన వెంకటేష్‌(28) గ్రామంలోనే కటింగ్ షాపు నడిపిస్తుంటాడు. అయితే బంధువుల అమ్మాయి ఒకరు వెంకటేష్‌తో చాలా క్లోజ్‌గా ఉండెది. ఒకరినోకరు చూసుకుంటూ అలా అలా గత కొంతకాలంగా ఆమెను వెంకటేష్‌ ప్రేమించాడు. అయితే ఇటివలే తన మనుసులో చెప్పాలని ఊరు చివర్లో తనను ఆపి తన మనుసులో మాట చెప్పాడు నువ్వు అంటే నాకు ఇష్టం మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. దీనికి ఆ యువతి స్పందిస్తూ తనకు ప్రేమంటేనే ఇష్టం లేదని అయినా నిన్ను ఓ అన్నలా మాత్రమే భావించానని ఆ యువకుడికి చెప్పింది.

దీంతో ఆ యువకుడికి దిమ్మతిరింది. తీవ్ర మనస్తాపానిలోనై తనలో తానే కుమిలిపోతు, మనసికంగా కుంగిపోయిన వెంకటేష్ ఈ విషయాన్ని ఎవరితో చెప్పుకోలేక తనలో తనే మనసికంగా బలహీనపడిపోయి గురువారం మధ్యాహ్నం గ్రామానికి సమీపంలో ఉన్న గండిపేట చెరువు వద్దకు వెళ్లాడు. చివరకు తన దోస్తులకు ఫోన్‌చేసి తన ప్రేమ విషయం చెప్పి తానకు బ్రతకాలనిలేదని తాను చనిపోతున్నానని ఫోన్‌ కట్‌చేశాడు. దీంతో తన స్నేహితులు హుటాహుటినా చెరువు వద్దకు వెళ్లే సరికే చెరువులో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన స్నేహితులు చెరువులో గాలించి వెంకటేష్ మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories