టీడీపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు...ఎంపీ బుట్టా రేణుకకు...

టీడీపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు...ఎంపీ బుట్టా రేణుకకు...
x
Highlights

పసుపు పార్టీపై ఆశలు పెట్టుకుంది వైసీపీ వీడి సైకిల్ ఎక్కింది పార్టీలో మరొకరి చేరిక ఆమె ఎంపీ సీటుకు ఎసరు పెట్టింది. కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్...

పసుపు పార్టీపై ఆశలు పెట్టుకుంది వైసీపీ వీడి సైకిల్ ఎక్కింది పార్టీలో మరొకరి చేరిక ఆమె ఎంపీ సీటుకు ఎసరు పెట్టింది. కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ కోసం ఎదురుచూస్తోంది. అయినా ఎమ్మెల్యే సీటుపై పీటముడి వీడటం లేదు.

కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయ సమీకరణాలు రోజుకురోజుకు మారుతున్నాయి. అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో ఎవరికి చెక్ పెడుతుందో అంతుచిక్కడం లేదు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుకా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో సీఎం చంద్రబాబు బుట్టా రేణుకకు టికెట్ ఇస్తారో లేదోనన్న ఉత్కంఠ నెలకొంది.

మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరడం కర్నూలు పార్లమెంట్‌కు కోట్లకు సీటు ఖాయమవడంతో బుట్టా రేణుక ఎమ్మెల్యేగా బరిలో దిగేందుకు సిద్ధమైంది. చేనేత సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుక మొదట్లో ఎమ్మిగనూరు టికెట్ ఆశించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డికి సీఎం టికెట్ ప్రకటించడంతో బుట్టా రేణుకా ఎమ్మిగనూరుపై ఆశలు వదులుకుంది.

జిల్లాలో టీడీపీకి మంచి పట్టు ఉన్న ఆదోని నియోజకవర్గం నుంచి బుట్టా రేణుకా పోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి. మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన మీనాక్షి నాయుడును కాదని అధిష్టానం రేణుకకు టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మీనాక్షీ నాయుడు ప్రాబల్యం, ఆయన అనుచర వర్గం టీడీపీకి కలిసివచ్చే అవకాశాలున్నాయి. ఆదోని నియోజకవర్గంలో బయటివారు వచ్చి పోటీ చేసినా నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టరు. 1999 ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా చిత్తుగా ఓడించారు. సొంత నియోజకవర్గ అభ్యర్థులనే ఇక్కడి ప్రజలు గెలిపించుకునే ఆనవాయితీ కొనసాగుతోంది.

ఆదోని టికెట్ తనకు ఇవ్వాలని రేణుకా చంద్రబాబునాయుడును కోరినట్లు తెలుస్తుంది. రేణుకకు టికెట్ ఇచ్చే విషయంలో చంద్రబాబు సందిగ్ధంలో ఉన్నట్లు తెలిసింది. మీనాక్షి నాయుడును కాదని బుట్టా రేణుకకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో బుట్టాకు అంతుచిక్కడం లేదు. చంద్రబాబును నమ్ముకుని పార్టీ ఫిరాయించిన రేణుకకు సీటు ఇస్తాడో లేక ఖాళీ చేతులు చూపిస్తారోనన్న సస్పెన్షన్ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories