Top 6 News @ 6PM: అప్పుడు నన్ను ఎగతాళి చేశారు.. ఇప్పుడు అంతటా మనవాళ్లే.. ఇది కూడా అంతే: చంద్రబాబు
1) అప్పుడు నన్ను ఎగతాళి చేశారు.. ఇప్పుడు అంతటా మనవాళ్లే.. ఇది కూడా అంతే: చంద్రబాబు ఏపీ పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా...
1) అప్పుడు నన్ను ఎగతాళి చేశారు.. ఇప్పుడు అంతటా మనవాళ్లే.. ఇది కూడా అంతే: చంద్రబాబు
ఏపీ పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా ఏపీలో సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆయన విజయవాడ నుండి శ్రీశైలం వరకు సీ ప్లేన్ సేవలు ప్రారంభించారు. సీ ప్లేన్ సేవల ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సీ ప్లేన్‌లో ప్రయాణించి శ్రీశైలం చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. భవిష్యత్‌లో ఇక ఏ ఇజం ఉండదని, టూరిజం మాత్రమే ఉంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
గతంలో తాను ఐటి సేవలు వినియోగంలోకి తీసుకొచ్చినప్పుడు కొంతమంది ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఐటి రంగంలో మన వాళ్లే ఉన్నారని చంద్రబాబు గుర్తుచేశారు. ఇదే విషయాన్ని చెబుతూ భవిష్యత్‌లో సీ ప్లేన్ సేవలు కూడా అలాగే విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తాయన్నారు. ఏపీలో గత ఐదేళ్లలో పాలనలో విధ్వంసం జరిగిందని, వెంటలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ప్రజలు తమ ఓటు హక్కుతో ఆక్సీజన్ అందించారని అన్నారు. ఇకపై శ్రీశైలం కూడా తిరుమల తరహాలో అభివృద్ధి చేయడం జరుగుతుందని చంద్రబాబు తెలిపారు.
2) రుణమాఫీ, గ్రూప్ 1 నియామకాలపై మంత్రి పొంగులేటి క్లారిటీ
తెలంగాణలో మిగిలిన రైతులకు ప్రభుత్వం వైపు నుండి జరగాల్సి ఉన్న రైతు రుణమాఫీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ చివరి నాటికల్లా రైతులు అందరికీ రుణమాఫీ అవుతుందని మంత్రి పొంగులేటి స్పష్టంచేశారు. మరో 13 వేల కోట్ల రుణం మాఫీ చేయాల్సి ఉందన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులు అధైర్యపడొద్దని, వారు పండించిన ప్రతీ చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. అలాగే వారి పంటలకు సరైన మద్దతు ధర కూడా అందిస్తామని తేల్చిచెప్పారు. ఇటీవల ముగిసిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ఫలితాలు, నియామకాలు గురించి స్పందిస్తూ డిసెంబర్ లో గ్రూప్ 1 విజేతలు నియామకపత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వైపు నుండి ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు.
3) AP News: నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల.. చాగంటి కోటేశ్వరరావుకు కీలక పదవి
Nominated Posts: నామినేటేడ్ పదవుల రెండో జాబితాను శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. 1. అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( మైనార్టీ అఫైర్స్ ) క్యాబినెట్ ర్యాంక్ - మహమ్మద్ షరీఫ్ ( నర్సాపురం-టిడిపి ) 2. అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ) క్యాబినెట్ ర్యాంక్ - చాగంటి కోటేశ్వర్ రావు 3. ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - కూడిపూడి సత్తిబాబు ( రాజమండ్రి - టిడిపి)
4. ఏపీ గవర వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - మాల సురేంద్ర ( అనకాపల్లి - టిడిపి ) 5. ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - రోనంకి కృష్ణం నాయుడు ( నరసన్నపేట - టిడిపి ) 6. ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్- పీవీజీ కుమార్ ( మాడుగుల - టిడిపి ) 7. ఏపీ కురుబ - కురుమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - దేవేంద్రప్ప ( ఆదోని - టిడిపి ) 8. ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - ఆర్ సదాశివ ( తిరుపతి - టిడిపి )
9. ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - సావిత్రి ( అడ్వొకేట్ - బీజేపీ ) 10. ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - పాలవలస యశస్వి ( శ్రీకాకుళం - జనసేన ) 11. ఏపీ వాల్మీకి - బోయ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - కపట్రాల సుశీలమ్మ ( బోజమ్మ ) ( ఆలూరు - టిడిపి ) 12. ఏపీ వన్యకుల క్షత్రియ ( వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ లిమిటెడ్ - సి ఆర్ రాజన్ ( చంద్రగిరి -టిడిపి). పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4) ప్రజలకు తెలిసొచ్చింది.. బీఆర్ఎస్ నేతలకు టెన్షన్ వద్దు: కేసీఆర్
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఏం కోల్పోయారో వారికి తెలిసొచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. సిద్ధిపేటలో పాలకుర్తి నియోజకవర్గ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూనే బీఆర్ఎస్ నేతల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు.
5) కాంగ్రెస్ ప్లాన్ చేస్తోన్న ఆ రిజర్వేషన్లను బీజేపి అనుమతించదు: అమిత్ షా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఫేక్ రాజ్యాంగం కాపీనీ చూపించి ఆయన రాజ్యాంగాన్ని కించపరిచారని అమిత్ షా అన్నారు. రాజ్యాంగం అనేది విశ్వాసాలు, నమ్మకాలతో కూడింది. అంత విలువైన రాజ్యాంగానికి సంబంధించిన ఫేక్ కాపీని చూపించడం అంటే అది రాసిన డా బిఆర్ అంబేద్కర్ ను అవమానించడమే అవుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఓబీసీలు, గిరిజనులు, దళితుల నుండి రిజర్వేషన్ కోటా లాక్కుని మైనారిటీలకు ఇవ్వాలని చూస్తోందని అమిత్ షా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ మైనారిటీలకు రిజర్వేషన్ ఇవ్వాలని భావిస్తోంది. కానీ మోదీ నాయకత్వంలో పనిచేసినంత కాలం మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడానికి బీజేపి అనుమతించదు అని ఆయన స్పష్టంచేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలంలో జరిగిన బీజేపి ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
6) Pakistan: క్వెట్టా రైల్వేస్టేషన్ వద్ద బాంబు పేలుడు.. 25 మంది మృతి
Pakistan: పాకిస్తాన్ లోని క్వెట్టా రైల్వేస్టేషన్ వద్ద శనివారం జరిగిన బాంబు పేలుడులో 25 మంది మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. రైల్వే ఫ్లాట్ పారానికి సమీపంలోని బుకింగ్ ఆఫీస్ వద్ద పేలుడు జరిగిందని జియో న్యూస్ తెలిపింది. జాఫర్ ఎక్స్ ప్రెస్ శనివారం ఉదయం 9 గంటలకు పెషావర్ నుంచి బయలుదేరాల్సి ఉంది. పేలుడు జరిగిన సమయంలో రైలు ఇంకా ఫ్లాట్ ఫారం వద్దకు చేరుకోలేదు. ఇది ఆత్మాహుతి దాడి మాదిరిగా ఉందని క్వెట్టా సీనియర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ ఎస్ఎస్ పీ ఆపరేషన్స్ మహమ్మద్ బలోచ్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. సంఘటన జరిగిన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సంఘటన స్థలంలో క్లూ స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులు ఆదేశించారు. పేలుడుపై విచారణకు ఆదేశం బెలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో సాధారణ ప్రజలు మరణించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. సాధారణ ప్రజలు, కార్మికులు, పిల్లలు, మహిళలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడి చేశారని ఆయన ఆరోపించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire