కుటుంబ కలహాలతో భార్య పుట్టింటికి వెళ్లి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డిన ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్...
కుటుంబ కలహాలతో భార్య పుట్టింటికి వెళ్లి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డిన ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిలింనగర్, గౌతమ్‌నగర్‌లో ఆర్.రాము(26), సురేఖ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాగా రాము ఓ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. రాము డ్రైవింగ్ చేసి ఇంటికి వచ్చే సమయానికి రోజు ఫుల్‌గా మద్యం సేవించి వచ్చేవాడు.
ఈ క్రమంలోనే భార్య, భర్తల మధ్య మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భార్య (సురేఖ)కు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో నెలరోజుల క్రితం తల్లిదండ్రులు వచ్చి శామీర్‌పేటలోని పుట్టింటికి తీసుకువెళ్లారు. ఇక అప్పటినుంచి రాము ఎన్నిసార్లు ఇంటికి రమ్మని పిలిచినా రావడంలేదు. రెండురోజుల క్రితం తమ పెళ్లిరోజు ఉందని, తన భార్యను పంపించాలని కోరినా ఒప్పుకోలేదు. మంగళవారం శామీర్‌పేటకు వెళ్లిన రాము అత్తామామ, బామ్మర్థితో ఇదే విషయంలో గొడవ పడి వచ్చాడు. ఇక ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన రాము బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు అత్తామామలు, బామ్మర్థి కారణమని సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తున్నది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire