తన భార్యతో చనువుగా ఉండటం చూసి..

తన భార్యతో చనువుగా ఉండటం చూసి..
x
Highlights

వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారితీసిన సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌...

వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారితీసిన సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌ నగర్‌ జిల్లా, రేకులబి తాండకు చెందిన బానోతు రాము (28) నగరానికి వలస వచ్చి మణికొండలో ఉంటున్నాడు. కాగా అదే ప్రాంతంలో ఉంటున్న రమేష్‌ భార్య శాంతితో కాస్తా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. మంగళవారం రాత్రి రాము తన భార్య శాంతితో చనువుగా ఉండడాన్ని తట్టుకోలేకపోయిన రమేష్‌ తీవ్ర ఆగ్రహానికిలోనై కత్తితో రాముపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రాము అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో వెంటనే రమేష్‌ రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులు రాము మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రమేష్‌ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories