తలనొప్పి అని డాక్టర్‌ దగ్గరకు వెళితే.. మహిళను చికటి గదిలోకి..

తలనొప్పి అని డాక్టర్‌ దగ్గరకు వెళితే.. మహిళను చికటి గదిలోకి..
x
Highlights

మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు నివరించేందు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ ఫలితం లేకుండా పోతుంది. లోకంలో కామందుల చేతిలో స్త్రీ బలికాక...

మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు నివరించేందు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ ఫలితం లేకుండా పోతుంది. లోకంలో కామందుల చేతిలో స్త్రీ బలికాక తప్పడం లేదు. ఇదిలా ఉంటే వైద్యం కోసమని ఆసుపత్రికి వెళ్లినా ఓ మహిళకు అక్కడ కూడా లైంగిక వేధింపులు తప్పలేదు. వైద్యో నారాయణో హరి అంటారు. కానీ అలాంటి వైద్యుడే కామంతో కళ్లు ముసుపోయి ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడో కీచక వైద్యుడు. నొప్పి తగ్గాలంటే మసాజ్‌ చేయాలంటూ గదిలోకి తీసుకెళ్లి మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చిలుకనగర్‌ బస్తీకి చెందిన ఓ మహిళకి బాగా తలనోప్పి రావడంతో స్థానికంగా ఉన్న బస్తీ దవాఖానాను సంప్రదించి.

తలనొప్పి, దగ్గు తరచూ వస్తుందని పరీక్షలు చేయమని వైద్యుడు బాలరాజును సంప్రదించారు. అయితే ఈ తల నొప్పి తగ్గలంటే మసాజ్‌ చేయాలంటూ ఆస్పత్రిలోని ఓ చికటి గదిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు ఆ వైద్యుడు. దీంతో మహిళ ఉప్పల్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలరాజును అదుపులోకి తీసు​కొని విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories