రెండు రాష్ట్రాల్లో ఆలయాలకు బారులు తీరుతున్న భక్తులు

రెండు రాష్ట్రాల్లో ఆలయాలకు బారులు తీరుతున్న భక్తులు
x
Highlights

విశాఖ వాసుల కొంగుబంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో దర్శనం ఇచ్చిన అమ్మవారు.. ఈ రోజు కనకమహాలక్ష్మిగా, విజయలక్ష్మిగా భక్తులను కటాక్షిస్తుంది..

వరంగల్ భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలలో చివరిరోజు అమ్మవారి నిజారూప దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వాహన, షమీ పూజల కోసం పోటెత్తిన భక్తులతో దేవాలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. విజయదశమి రోజున అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయాలు వరిస్తాయని భక్తుల నమ్మకం..

విశాఖ వాసుల కొంగుబంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో దర్శనం ఇచ్చిన అమ్మవారు.. ఈ రోజు కనకమహాలక్ష్మిగా, విజయలక్ష్మిగా భక్తులను కటాక్షిస్తుంది..

తెలంగాణలో తెల్లవారు జాము నుంచే దసరా పండుగ సందడి మొదలైంది. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌ పెద్దమ్మ టెంపుల్‌లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దుర్గ శరనవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు కావడంతో మండపాల దగ్గర కోలాహలం కనిపిస్తోంది.

ప్రకాశం జిల్లాలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఒంగోలులోని కనకదుర్గమ్మ ఆలయంలో తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు గతంతో పోలిస్తే కరోనా కారణంగా భక్తుల తాకిడి తక్కువగానే ఉన్నట్టు అర్చకులు చెబుతున్నారు.

శరన్నరాత్రుల ముగింపుతో విజయాల విజయదశమి వేడుకలు నెల్లూరు జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు లోగిళ్ళు విజయదశమి వేడుకలతో అలరారుతున్నాయి. వస్తు, వాహన పూజలతో ప్రతీ ఇంటా దశమి ఆధ్యాత్మిక శోభ అలుముకుంది.

కర్నూలు జిల్లాలో దసరా ఉత్సవాలు చివరిరోజు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే ఆలయాల్లో గ్రామోత్సవాలు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు భక్తులు మాస్కులు ధరించి ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. చివరి రోజు కావడంతో ఆయా ఆలయాల్లో అమ్మవారు నిజరూప అలంకరణలతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

విజయదశమి సందడితో కాకినాడలో ప్రముఖ ఆలయాలు కళకళాడుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీలు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

దుష్ట రాక్షసులపై దుర్గమ్మ సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే విజయదశమితో కడప జిల్లాలో అమ్మవారి ఆలయాలతో కళకళాడుతున్నాయి. అయితే.. కరోనా నేపథ్యంలో శరన్నవ రాత్రుల్లో భాగంగా ఆలయాలకు రాలేకపోయామని.. పండుగ రోజు వద్దామన్న కరోనా భయాందోళనలతో ఎక్కువ మంది రాలేకపోయారని ఆలయ అధికారులు తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారికి ప్రత్యేక అలంకార పూజలు, అభిషేకాలు, కుంకుమార్చన నిర్వహించారు ఆలయ అర్చకులు. చివరి రోజు కావడంతో అమ్మవారిని దర్శించేందుకు కోవిడ్ నిబంధనాల్ని పాటిస్తూ భక్తులు పోటెత్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories