ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు

ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు
x
Highlights

వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు ఇవాళ రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. అన్ని నిరసన కేంద్రాల దగ్గర ఈ దీక్ష...

వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు ఇవాళ రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. అన్ని నిరసన కేంద్రాల దగ్గర ఈ దీక్ష నిర్వహించనున్నారు. మూడు వారాలకుపైగా సాగుతున్న నిరసన దీక్షల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళిగా 'శ్రద్ధాంజలి దివస్‌ను' పాటించారు.

ఆందోళన చేపట్టిన అన్నదాతలతో మరో రెండు రోజుల్లో చర్చలు ప్రారంభమవుతాయని హోంమంత్రి అమిత్‌ షా సంకేతాలిచ్చారు. వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ రైతు నేతలతో చర్చలు పున:ప్రారంభిస్తారన్నారు. మరోవైపు సింఘు సరిహద్దు దగ్గర 11 మంది రైతులతో రిలే నిరాహార దీక్ష జరుగుతుందన్నారు స్వరాజ్‌ ఇండియా నేత యోగేంద్ర యాదవ్‌.

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి రోజైన డిసెంబర్‌ 25న ప్రధాని మోదీ రైతులతో మాట్లాడుతారని బీజేపీ తెలిపింది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని దాదాపు 2వేల 500 ప్రాంతాల్లో కిసాన్‌ సంవాద్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories