కోడిగుడ్డు అడిగాడని నాలుగేళ్ల బాలుడిపై..

కోడిగుడ్డు అడిగాడని నాలుగేళ్ల బాలుడిపై..
x
Highlights

ఆకలిగా ఉందని గుడ్డు అడిగిన నాలుగేళ్ల బాలుడిపై కర్కశంగా ప్రవర్తించిందో మహిళ. ఈ ఘటన బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌ జిల్లా రఘునాథ్‌గంజ్ ప్రాంతంలో...

ఆకలిగా ఉందని గుడ్డు అడిగిన నాలుగేళ్ల బాలుడిపై కర్కశంగా ప్రవర్తించిందో మహిళ. ఈ ఘటన బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌ జిల్లా రఘునాథ్‌గంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న బాలల అభివృద్ధి కేంద్రంలో సెహరీ బవ ఉద్యోగిగా పనిచేస్తోంది. అల్పాహారంలో భాగంగా చిన్నారులకు టిఫిన్ పెడుతుండగా కనుపూర్‌కు చెందిన బాలుడు మరో గుడ్డు కోసం అడిగాడు. ఆ మహిళ ఆగ్రహంతో బాలుడి వీపుపై సలసల మసులుతున్న వేడినీళ్లు పోసింది. దీంతో ఆ బాలుడికి నడుము, కాళ్లపై తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆ బాలుడు పరుగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై బెంగాల్ బాలల హక్కుల రక్షణ కమిషన్ స్పందించింది. దీనిపై తక్షణమే నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories