Worldwide Corona Updates: క‌రోనా క‌ల్లోలం .. ప్రపంచ వ్యాప్తంగా కోటీ 71లక్షలు దాటిన కేసులు

Worldwide Corona Updates: క‌రోనా క‌ల్లోలం .. ప్రపంచ వ్యాప్తంగా కోటీ 71లక్షలు దాటిన కేసులు
x
CORONA WORLD
Highlights

Worldwide Corona Updates: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకీ క‌రోనా మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి.

Worldwide Corona Updates: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకీ క‌రోనా మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి.ప్రపంచం మొత్తంలో కరోనా కేసుల సంఖ్య 1,71,89,755కి చేరుకున్నాయి. కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 6,70,256 కు పెరిగింది. ప్రస్తుతం 58,18,358 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,07,01,141 మంది వైర‌స్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.అమెరికా, బ్రెజిల్, ఇండియా, బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీలలో కరోనా వ్యాప్తి తీవ్రత కొన‌సాగుతోంది

అమెరికాలో రోజురోజుకీ భారీగా కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్ర‌స్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 45,68,037కి చేరింది. ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ 1,53,840 మంది మృతి చెందారు. అలాగే 21,69,153 యాక్టీవ్ కేసులు ఉండగా, 22,45,044 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

అలాగే భారత్​లోనూ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. క‌రోనా కేసుల్లో ప్ర‌పంచంలో 3వ స్థానానికి చేరింది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 52,123 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 15,83,792కి చేరింది. ఇక ప్రస్తుతం 5,28,242 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి కోలుకుని 10,20,582 మంది ఆస్ప్రతుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 775 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కోవిడ్ మ‌హ‌మ్మారి బారిన‌పడి 34,968 మంది మరణించారు.


దేశం

కరోనా కేసులు

మరణాలు

అమెరికా

4,568,375

153,845

బ్రెజిల్

2,555,518

90,188

ఇండియా

1,584,982

35,035

రష్యా

828,990

13,673

దక్షిణాఫ్రికా

471,123

7,497

మెక్సికో

408,449

45,361

పెరూ

400, 683

18,816

చీలీ

351,575

9,278

స్పెయిన్

329,721

28,441

Show Full Article
Print Article
Next Story
More Stories