ప్రపంచంలోనే పొడవైన వేలాడే వంతెన ప్రారంభం.. పొడవు 4.6 కి.మీ., టవర్ల ఎత్తు 318 మీ.

Worlds Longest Hanging Bridge Started Today 19 03 2022 in Turkey | Trending News
x

ప్రపంచంలోనే పొడవైన వేలాడే వంతెన ప్రారంభం.. పొడవు 4.6 కి.మీ., టవర్ల ఎత్తు 318 మీ.

Highlights

World's Longest Hanging Bridge: *నిర్మాణంలో పాల్గొన్న 5వేల మంది కార్మికులు *మొత్తం 18.98వేల కోట్ల వ్యయం

World's Longest Hanging Bridge: ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేలాడే బ్రిడ్జిని టర్కీ అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగాన్ ప్రారంభించారు. ఉత్తర టర్కీలోని కనక్కలే ప్రావిన్స్‌లోని డార్డనెల్లెస్‌ జలసంధిపై ఈ సస్పెన్షన్‌ బ్రిడ్జిని టర్కీ, దక్షిణ కొరియా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. దీనికి 2.8 బిలియన్‌ డాలర్లు అంటే.. సుమారు 18 వేల 986 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జిని 4.6 కిలోమీటర్ల పొడవున నిర్మించారు.

2017 మార్చిలో ప్రారంభమైన ఈ వేలాడే వంతెన నిర్మాణాన్ని డార్డానెల్లెస్‌ బ్రిడ్జి ప్రాజెక్టు పేరుతో అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో 5వేల మంది కార్మికులు పని చేశారు. టర్కీ ప్రభుత్వం ఇస్తాంబుల్‌లో మూడు, కనక్కలే ప్రావిన్స్‌లోఒక వంతెనను నిర్మించింది. కనక్కలే బ్రిడ్జి నాలుగోది. దీని టవర్లు 318 మీటర్ల ఎత్తుతో, 4.6 కిలోమీటర్ల పొడువన నిర్మించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories