Why Joe Biden Dropped: అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ మరోసారి ఎందుకు పోటీ చేయలేదు?

Why Joe Biden Dropped: అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ మరోసారి ఎందుకు పోటీ చేయలేదు?
x
Highlights

Why Joe Biden Dropped From US Presidential Election 2024: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎందుకు రెండోసారి పోటీ చేయడం లేదు? గతంలో జార్జి డబ్లూ బుష్, బరాక్ ఒబామా సహా పది మందికిపైగా అధ్యక్షులు రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన వాళ్లు ఉన్నారు.

Why Joe Biden Dropped From US Presidential Election 2024: ప్రస్తుతం ప్రపంచం అంతా అమెరికా ఎన్నికల చుట్టే తిరుగుతోంది. అమెరికాలో ఎన్నికల ప్రక్రియ ఎంత వరకు వచ్చింది? ఓట్ల లెక్కింపు ఎంత వరకు వచ్చింది? అమెరికా అధ్యక్షుడిగా గెలిచేది ఎవరు? అనే అంశాలపైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. అదే సమయంలో కొంతమందికి ఇంకో డౌట్ కూడా వస్తోంది. అదేంటంటే.. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఈసారి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని? వారికి అలా సందేహం రావడానికి కారణం కూడా లేకపోలేదు.

భారత్‌లో ఎన్నికల సరళి, ఇక్కడి రాజకీయాల్లో ఒకసారి ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా గెలిచిన వాళ్లు వీలైనంత వరకు ఆ స్థానాన్ని అలాగే పదిలం చేసుకోవాలనే ధోరణిలో ఉంటారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఏదైనా బలమైన కారణం ఉంటేనో లేక పార్టీ అధిష్టానం వారిని పక్కకు పెడితేనో తప్ప ఒకసారి ఆ స్థాయికి వచ్చిన నాయకులు ఎవ్వరూ రెండోసారి ఆ పదవివి దూరంగా ఉండాలని అనుకోరు. అలాంటప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎందుకు రెండోసారి పోటీ చేయడం లేదు? గతంలో జార్జి డబ్లూ బుష్, బరాక్ ఒబామా సహా పది మందికిపైగా అధ్యక్షులు రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన వాళ్లు ఉన్నారు. మరి జో బైడెన్ ఎందుకు పోటీ చేయడం లేదనేది వారి సందేహం.

ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం విషయానికొద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో తాను నిలబడటం లేదని జో బైడెన్ ఈ ఏడాది జులై 21వ తేదీనే పబ్లిక్గా ప్రకటించారు. అందుకు కారణం కూడా చెప్పారు. తమ సొంత పార్టీ అయిన డెమొక్రటిక్ పార్టీలోనే తన అభ్యర్థిత్వంపై కొన్ని బిన్నాభిప్రాయాలున్నాయి. పార్టీలో అంతర్గతంగా విభేదాలు ఉన్నప్పుడు పోటీ చేస్తే అది ప్రత్యర్థికి ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ తన లక్ష్యం తాను మరోసారి అమెరికా అధ్యక్షుడు అవడం కాదు. డోనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడు అవకుండా చూడటమే తన ప్రధాన కర్తవ్యం అని జో బైడెన్ చెప్పారు. అందుకే తాను పోటీ చేయకుండా తమ పార్టీ తరపున కమలా హారీస్ ని అమెరికా ప్రెసిడెంట్‌గా గెలిపించేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టంచేశారు.

అది తప్పుడు ప్రచారమన్న బైడెన్

జో బైడెన్ ఎందుకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే విషయంలో రకరకాల కామెంట్స్ వినిపించాయి. ఆయనకు వయసైపోయిందని, ఆరోగ్యం సహకరించడం లేదని రకరకాలుగా ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారంలో నిజం లేదని జో బైడెన్ తేల్చిచెప్పారు. తన ఆరోగ్యం, మానసిక పరిస్థితి అంతా బాగానే ఉందని బైడెన్ వివరించారు. పోటీ చేయకపోవడానికి గల కారణాలను చెప్పే క్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories