Susie Wiles: ఎవరీ సూసి వైల్స్? వైట్ హౌస్ 'చీఫ్ ఆఫ్ స్టాఫ్'గా నియమించిన ట్రంప్

Susie Wiles: ఎవరీ సూసి వైల్స్? వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా  నియమించిన ట్రంప్
x
Highlights

Susie Wiles: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచార మేనేజర్ సూసి వైల్స్ ను వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమించారు....

Susie Wiles: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచార మేనేజర్ సూసి వైల్స్ ను వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమించారు. ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్ ను విజయవంతంగా అధ్యక్ష పీఠం వరకు చేర్చడంలో ఆమె ప్రత్యేక పాత్ర పోషించారు.

ఎంతో పకడ్బందీగా, అత్యంత క్రమశిక్షణతో ట్రంప్ తన ప్రచారాన్ని నిర్వహించడం వెనక సూసి చాలా కష్టపడిందని సంబంధిత వర్గాలు చెప్పాయి. అమెరికా హిస్టరీలోనే మొట్టమొదటి మహిళా చీఫ్ ఆఫ్ స్టాప్ సూసి కానుంది. ట్రంప్ తన విక్టరీ స్పీచ్ లో కూడా ఆమెకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినా..ఆమె నిరాకరించింది. అసలు ఎవరీ సూసి వైల్స్..అమె బ్యాక్ గ్రౌండ్ ఏంటీ? తెలుసుకుందాం.

సూసి వైల్స్ రాజకీయ రంగంలో ఎంతో అనుభవం ఉన్న ఒక ప్రఖ్యాత మహిళ. ఆమె కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో విభిన్న రాజకీయ కార్యాచరణల్లో పాల్గొన్న అగ్రనాయకురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. ట్రంప్ ప్రణాళికల్లో అమె సహకారం చాలా గొప్పదని ట్రంప్ వర్గీయులు అంటున్నారు. సూసి అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందినవారు.

ఆమె దీర్ఘకాలికంగా రిపబ్లికన్ పార్టీ వ్యూహకర్తగా పనిచేసిన అనుభవం ఉంది. 2016, 2020లో రాష్ట్రంలో ట్రంప్ ప్రచార బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. ఇప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలను చేపట్టడంలోనూ సూసీ ప్రధాన పాత్ర పోషించారు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ గురువారం తన ఎన్నికల ప్రచార నిర్వాహకురాలు సుజానే విల్స్‌ను వైట్‌హౌస్ 'చీఫ్ ఆఫ్ స్టాఫ్'గా నియమించారు. వైట్ హౌస్ అనేది అమెరికా అధ్యక్షుని అధికారిక కార్యాలయం, నివాసం.

ఈ బాధ్యతను స్వీకరించిన తర్వాత, వైల్స్ ఈ శక్తివంతమైన పదవిని నిర్వహించిన మొదటి మహిళగా కొత్త చరిత్రను సృష్టించనున్నారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చేందుకు సూసి వైల్స్ అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉంటారని ట్రంప్ కొనియాడారు. అమెరికా చరిత్రలో తొలి మహిళా ‘చీఫ్ ఆఫ్ స్టాఫ్’ కావడం విశేషం.

అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జెడీ వాన్స్... ట్రంప్ ఉత్తర్వులను ట్విట్టర్‌లో పంచుకున్నారు. 'ఆమె మన దేశం గర్వపడేలా చేస్తుందనడంలో నాకు సందేహం లేదు' అని ట్రంప్‌ ఉటంకిస్తూ... 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ విజయవంతమైన ఎన్నికల ప్రచారానికి వైల్స్ మేనేజర్‌గా ఉన్నారని పేర్కొన్నారు.


అటు ట్రంప్ కూడా తన సందేశంలో... అమెరికా చరిత్రలో అతిపెద్ద రాజకీయ విజయాన్ని సాధించడంలో సూసీ వైల్స్ నాకు సహాయపడిందని తెలిపారు. 2016, 2020లో నా విజయవంతమైన ఎన్నికల ప్రచారంలో ఆమె అంతర్భాగంగా ఉంది. సూసీ తెలివైన, కఠినమైన నిర్ణయాలు తీసుకునే, వినూత్నమైన మహిళ, ప్రతి ఒక్కరూ ఆమెను ఇష్టపడతారు, గౌరవిస్తారని ట్రంప్ చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories