WHO: బాంబు దాడి నుండి తృటిలో తప్పించుకున్న WHO చీఫ్..
WHO: యెమెన్‌లోని సనా విమానాశ్రయంలో జరిగిన బాంబు దాడి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని...
WHO: యెమెన్‌లోని సనా విమానాశ్రయంలో జరిగిన బాంబు దాడి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. యెమెన్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కేందుకు వేచిఉండగా..వైమానిక బాంబు దాడి జరిగింది. సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని ఐక్యరాజ్యసమితి ఖండించింది.
Our mission to negotiate the release of @UN staff detainees and to assess the health and humanitarian situation in #Yemen concluded today. We continue to call for the detainees' immediate release.
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) December 26, 2024
As we were about to board our flight from Sana’a, about two hours ago, the airport… pic.twitter.com/riZayWHkvf
ఐక్యరాజ్యసమితికి చెందిన ఉద్యోగులతో కలిసి ఖైదీల విడుదలపై చర్చలు, యెమెన్ లో ఆరోగ్యం, మానవతా పరిస్థితులను అంచనా వేసేందుకు అక్కడికి వెళ్లాము. ఖైదీలను తక్షణమే విడుదల చేయలని మేము పిలుపునిచ్చాము. సనాలో విమానం ఎక్కేందుకు వేచి ఉండగా బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు మ్రుతి చెందినట్లు సమాచారం. విమానంలోని ఓ సిబ్బంది గాయాలపాలయ్యారు. ఘటన జరిగిన ప్రాంతానికి మాకు కొన్ని మీటర్ల దూరమే ఉంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియచేస్తున్నామని అధానోమ్ ఎక్స్ లో పోస్టు చేశారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire