డోనాల్డ్ ట్రంప్ న‎కు శ్వేత సౌధం షాక్

డోనాల్డ్ ట్రంప్ న‎కు శ్వేత సౌధం షాక్
x
Highlights

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు శ్వేత సౌధం షాకిచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయినట్టు ట్రంప్‌ ఇంకా అంగీకరించనప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అధికార బదిలీకి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నకు శ్వేత సౌధం షాకిచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయినట్టు ట్రంప్‌ ఇంకా అంగీకరించనప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అధికార బదిలీకి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. అధికార బదిలీ చేయాల్సిన అవసరం ఏర్పడితే అందుకు చట్ట ప్రకారం చేయాల్సిన అన్ని పనులను చేస్తున్నామని శ్వేత సౌధంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ట్రంప్‌ అధికార యంత్రాంగం ప్రకటించింది.

ఓ వైపు ఓట్ల లెక్కింపుపై వివాదం కొనసాగుతున్నప్పటికీ ప్రెసిడెన్షియల్‌ ట్రాన్సిషన్‌ యాక్ట్‌ ప్రకారం పాటించాల్సిన ప్రక్రియను మొదలుపెట్టామని శ్వేత సౌధం ప్రెస్‌ సెక్రటరీ అన్నారు. అధికార యంత్రాంగం తరఫున చేయాల్సిన కార్యక్రమాలను చేస్తున్నామన్నారు. అయితే ఎన్నికల ఫలితాలపై అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు అందకపోవడంతో అధికార మార్పిడిని పర్యవేక్షించాల్సిన జనరల్‌ సర్వీసెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం మాత్రం మౌనం పాటిస్తోంది. అటు జో బైడెన్‌ విజయం సాధించినట్టు జనరల్‌ సర్వీసెస్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఎమిలీ మర్ఫీ కూడా ఇంతవరకు ప్రకటించలేదు.

మరోవైపు డెమోక్రాట్లకు కంచుకోటగా పేరున్న విస్కాన్సిన్‌‎లోని డేన్, మిల్‌వాకీ కౌంటీల్లో ఓట్ల లెక్కింపు తిరిగి శుక్రవారం ప్రారంభమయింది. ఇక్కడ పోలయిన వేలాది పోస్టల్‌ బ్యాలెట్‌లను రద్దు చేయాలంటూ ట్రంప్‌ తరఫున రిపబ్లికన్‌ పార్టీ నేతలు అభ్యంతరం తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్ల కవర్లపై అడ్రస్ లు లేకపోతే వాటిని ఎన్నికల క్లర్కులే రాశారని, ఇక్కడే అక్రమాలకు మార్గం ఏర్పడిందని ఆరోపించారు. అయితే ఇలా చిరునామాలు రాసే అధికారం ఇక్కడి చట్టం ప్రకారం క్లర్కులకు ఉందంటూ బోర్డ్‌ ఆఫ్‌ కాన్వార్సెర్స్‌ తెలిపింది. గత 11 ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసింది. దాంతో పోస్టల్‌ బ్యాలెట్లను పరిగణనలోకి తీసుకొని లెక్కింపు జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories