ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు ఇవే.. ఎందుకో తెలుసా..?

Which country is the most powerful in the world know the military strength and number of tanks of those countries
x

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు ఇవే.. ఎందుకో తెలుసా..?

Highlights

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు ఇవే.. ఎందుకో తెలుసా..?

Powerful Countries: ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల గురించి చర్చించినప్పుడు వాటిలో అమెరికా, ఇండియా, చైనా సహా అనేక దేశాల పేర్లు వినిపిస్తాయి. దీని వెనుక సామాజిక, ఆర్థిక కారణాలు ఉంటాయి. ఒక దేశం శక్తివంతమైన దేశంగా మారాలంటే సామాజికంగా, ఆర్థికంగా మాత్రమే కాకుండా ఆ దేశ సైనిక బలం, యుద్ద సామగ్రి, టెక్నాలజీ, మానవ వనరులపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలోని వివిధ దేశాల సైనిక బలం, ఇతర విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. భారతదేశం

భారత్‌లో 14.60 లక్షల సైన్యం ఉంది. 17 వేల కంటే ఎక్కువ ఫిరంగి, యుద్ద ట్యాంక్ వ్యవస్థలు ఉన్నాయి. విమానాల విషయంలో భారత్ చాలా బలంగా ఉంది.

2. పాకిస్తాన్

పాకిస్థాన్ గురించి చెప్పాలంటే పాక్ ఆర్మీలో 6.51 లక్షల మంది సైనికులు ఉన్నారు. 6000 కంటే ఎక్కువ యుద్ద వాహనాలు, 7000 కంటే ఎక్కువ ఫిరంగి, ట్యాంక్ నిరోధక వ్యవస్థలు కలిగి ఉంది.

3. చైనా

చైనా సైన్యంలో 20.35 లక్షల మంది సైనికులున్నారు. 20 వేలకు పైగా యుద్ద వాహనాలు, 26 వేల కంటే ఎక్కువ ఫిరంగి, యుద్ద ట్యాంక్ నిరోధక వ్యవస్థలు, 5 వేలకు పైగా విమానాలు ఉన్నాయి.

4. అమెరికా

అమెరికా సైన్యంలో 13.95 లక్షల మంది సైనికులు ఉన్నారు. అమెరికా 46 వేలకు పైగా యుద్ధ వాహనాలు, 14 వేలకు పైగా విమానాలతో చాలా శక్తివంతంగా ఉంది.

5. ఉత్తర కొరియా

ఉత్తర కొరియాలో 12.80 లక్షల మంది సైనికులు పనిచేస్తున్నారు. 34 వేల కంటే ఎక్కువ ఫిరంగి, యుద్దట్యాంకులు, 6500 కంటే ఎక్కువ పోరాట వాహనాలు ఉన్నాయి. అంతేకాదు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ అణు పరీక్షలు కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.

6. దక్షిణ కొరియా

దక్షిణ కొరియా గురించి చెప్పాలంటే ఇక్కడ 5.55 లక్షల మంది సైనికులు పనిచేస్తున్నారు. 7 వేలకు పైగా ఫిరంగులు, యుద్దట్యాంక్‌లు కలిగి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories