Sunita Williams: భారత సంతతికి చెందిన ఈ ఆస్ట్రోనాట్‌కు అంతరిక్షంలో ఎదురైన సమస్య ఏంటి?

What is the problem faced by this Indian-origin astronaut in space?
x

Sunita Williams: భారత సంతతికి చెందిన ఈ ఆస్ట్రోనాట్‌కు అంతరిక్షంలో ఎదురైన సమస్య ఏంటి?

Highlights

ఈ ఏడాది జూన్ 5న చివరి నిమిషంలో సునీతా విలియమ్స్, బారీ బుచ్ విల్మోర్ లు అంతరిక్షయాత్ర వాయిదా పడింది.

సునీతా విలియమ్స్, బారీ బుచ్ విల్మోర్ లు అంతరిక్షంలోనే చిక్కుకున్నారు. వీరిద్దరూ భూమి మీదికి చేరుకోవడానికి ఇంకా సమయం పట్టనుంది. ఈ ఇద్దరిని అంతరిక్ష స్పేస్ సెంటర్ కు తీసుకెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. టెక్నికల్ సమస్యలను సరిచేసిన ఈ ఇద్దరిని భూమి మీదకు తీసుకురావాలి. ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఇటీవల లైవ్ కాన్ఫరెన్సులో మాట్లాడారు. హరికేన్లను తాము ఫోటోలు తీస్తున్నామని చెప్పారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని, తాము సేఫ్‌గా భూమి మీదకు దిగుతామని నమ్మకంగా చెప్పారు.


బోయింగ్ తయారు చేసిన మానవ సహిత వ్యోమనౌక కు ఏమైంది?

విమానాలు తయారు చేసే కంపెనీల్లో బోయింగ్ ప్రసిద్ది చెందింది. అంతరిక్షయాత్ర చేసేందుకు వీలుగా వ్యోమనౌకను బోయింగ్ సంస్థ తయారు చేసింది. ఈ క్రూ ఫ్లైట్ టెస్ట్ లో సునీతా విలియమ్స్, బారీ బుచ్ విల్మోర్ లు పాల్గొన్నారు. ఈ వ్యోమనౌక ద్వారా అంతరిక్షయానం మొదటి నుండి అవాంతరాలే ఎదురయ్యాయి.

ఈ ఏడాది జూన్ 5న చివరి నిమిషంలో సునీతా విలియమ్స్, బారీ బుచ్ విల్మోర్ లు అంతరిక్షయాత్ర వాయిదా పడింది. టెక్నికల్ సమస్యలను సరి చేసిన తర్వాత జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమ నౌక అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది. అంతరిక్ష స్పేస్ సెంటర్ లో సునీతా విలియమ్స్, విల్మోర్ లు దిగిన వీడియోలను నాసా విడుదల చేసింది.


అంతర్జాతీయ స్పేస్ సెంటర్లో ఆగిపోయిన సునీతా విలియమ్స్

సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన అమెరికన్ ఆస్ట్రోనాట్. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్ నుంచి అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికన్‌ను పెళ్ళి చేసుకున్నారు. ఒహాయో నగరంలో పుట్టిన సునీత మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాక కొంత కాలం నేవీలో పని చేశారు. ఆ తరువాత 1998లో నాసాలో ఆస్ట్రోనాట్‌గా కెరీర్ ప్రారంభించారు.

ఇప్పుడు విల్మోర్‌తో కలిసి జూన్ 6న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు చేరుకున్న సునీత అక్కడ చేయాల్సిన చాలా పనులను చక్కబెట్టారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వారు జూన్ 13న లేదా 14న అక్కడి నుంచి బయలుదేరాలి. కానీ, వీరు బయలుదేరాల్సిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ వ్యోమనౌక ఐఎస్ఎస్ తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీతో పాటు ఇతర సమస్యలను గుర్తించారు. టెక్నికల్ సమస్యలను సరిచేస్తేనే సునీతా, విల్మోర్ లు అక్కడి నుండి భూమి మీదకు వస్తారు.

అయితే ఈ సమస్యను సరిచేసి జూన్ 26న ఈ వ్యోమనౌక భూమి మీదకు వస్తుందని నాసా ప్రకటించింది. కానీ, ఈ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు.


స్పేస్ షిప్‌లో హీలియం లీకైతే ఏమౌతుంది?

వ్యోమనౌకలో హీలియం లీక్ కావడం వల్ల అవసరమైన మేరకు ఒత్తిడి మెయింటైన్ చేయడం సాధ్యం కాదు. అంతేకాదు ఇందులోని 28 రియాక్షన్ కంట్రోల్ సిస్టం థ్రస్టర్లలో కొన్ని పాడైనట్టుగా గుర్తించారు. వ్యోమనౌక సజావుగా పనిచేయాలంటే కనీసం 14 థ్రస్టర్లు సక్రమంగా పనిచేయాలి.

ప్రొపల్లెంట్ వాల్వ్ కూడా పాక్షికంగా ఫెయిలైంది. బోయింగ్ స్టార్ లైనర్ 45 రోజులు ఐఎస్ఎస్ తో అనుసంధానమై ఉంటుంది. అయితే దాన్ని 72 రోజులు అనుసంధానమై ఉండేలా రిపేర్లు చేస్తున్నారు.ప్రస్తుతం అంతరిక్షానికి వెళ్లిన వ్యోమనౌక రిపేర్ చేయడానికి మరింత సమయం పడితే స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ లేదా రష్యా సూయజ్ వ్యోమ నౌక ద్వారా తీసుకు వచ్చే అవకాశాలున్నాయి.


అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉంటే ప్రమాదమా?

అంతరిక్షంలో ఎక్కువ రోజులుంటే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మైక్రోగ్రావిటీ, రేడియేషన్ ఎక్స్ పోజర్, ప్రత్యేక వాతావరణ పరిస్థితులతో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. గురుత్వాకర్షణ ప్రభావం లేని కారణంగా రక్తపోటు నియంత్రణపై ప్రభావం ఉంటుంది. కాల్షియం పెరిగి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.

త్వరలోనే భూమిపైకి సురక్షితంగా తిరిగొస్తామన్న సునీతా విలియమ్స్

బోయింగ్ అంతరిక్ష నౌక స్టార్ లైనర్ లో పలు సమస్యలు తలెత్తినప్పటికి తాము అందులోనే భూమికి సురక్షితంగా తిరిగి వస్తామని సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు తెలిపారు.

థ్రస్టర్ ను పరీక్షించిన తర్వాత అంతరిక్షం నుండి ప్రయాణం అవుతామని చెప్పారు. అంతరిక్షంలో చిక్కుకున్న తర్వాత ఈ నెల 10న సునీతా విలియమ్స్, విల్మోర్ లు మాట్లాడారు. తాము సురక్షితంగానే ఉన్నట్టుగా చెప్పారు.


322 రోజులు అంతరిక్షంలో గడిపిన సునీతా విలియమ్స్

సునీతా విలియమ్స్ అంతరిక్షానికి మూడు సార్లు వెళ్లారు. 1998లో ఆమె నాసాకు ఎంపికయ్యారు. 2000 సంవత్సరంలో ఆమె శిక్షణ పూర్తైంది. 2006లో తొలిసారి అంతరిక్ష యాత్ర ఆమె దిగ్విజయంగా పూర్తి చేసుకొని వచ్చారు. 2012 లో రెండోసారి కూడా అంతరిక్ష యాత్ర సక్సెస్ అయింది. మూడోసారి బోయింగ్ వ్యోమనౌకతో అంతరిక్షానికి చేరుకున్నారు. ఈసారి ప్రాబ్లమ్ రావడంతో ఆమె అక్కడే ఆగిపోయారు. మొత్తంగా ఆమె 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. 50 గంటల 40 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు.

ఒక దేశం నుండి మరో దేశానికి ఫైట్ లో వెళ్లినట్టే అంతరిక్షయానం చేసేందుకు బోయింగ్ సంస్థ వ్యోమనౌకను తయారు చేసింది. ఈ వ్యోమనౌక రిపేర్ వర్క్ పూర్తి కాగానే సునీత, విల్మోర్‌లు నేల మీదకు అడుగుపెడతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories