Omicron Variant Symptoms: ప్రపంచాన్ని వణికిస్తున్న "ఒమిక్రాన్" వైరస్ లక్షణాలు ఇవే..

These are the Corona Third Wave Omicron Variant Symptoms
x

Omicron Variant Symptoms (Representational Image)

Highlights

Omicron Variant Symptoms: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. అసలు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయో...

Omicron Variant Symptoms: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. అసలు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. డెల్టా వేరియంట్ కంటే భిన్నంగా ఉన్న ఒమిక్రాన్ లక్షణాలు ఇలా ఉన్నాయి. దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ చీఫ్ డాక్టర్ ఏంజెలిక్ కోఎన్జీ చెప్పినదాని ప్రకారం గత 10 రోజుల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ బారిన పడిన 30 మంది రోగుల్ని పరిశీలించినట్టు తెలిపాడు.

ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్లో అలసట ఎక్కువగా ఉండటంతో పాటు గొంతులో ఇబ్బంది, శరీరంలోని మాంసపు భాగాల్లో నొప్పి, పొడి దగ్గు వంటి సమస్యలు ఉన్నట్టు గుర్తించామన్నారు. డెల్టా వేరియంట్ కు, ఒమిక్రాన్ కి మధ్య లక్షణాలు విభిన్నంగా ఉన్నాయని తెలిపాడు. ఇప్పటి వరకూ ఈ వైరస్ సోకిన వ్యక్తులు ఎవరూ వ్యాక్సిన్ తీసుకోలేదని ఆయన తెలిపారు. ఈ అందరిలో ఒమిక్రాన్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయంటున్నారు. ఈ వైరస్ 40 ఏళ్ల వయస్సు వారికి ఒమిక్రాన్ సోకిందంటున్నారు. యూరప్‌ దేశాల్లో ఒమిక్రాన్ సోకినవారి సంఖ్య ఎక్కువగా ఉందని డాక్టర్ ఏంజెలిక్ కోఎన్జీ తెలిపాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories