Cancer Vaccine: క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి వ్యాక్సిన్

Cancer Vaccine Vaccine for cancer treatment developed! Russia makes BIG claim on cancer treatment
x

 Cancer Vaccine: క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి వ్యాక్సిన్

Highlights

Cancer Vaccine: క్యాన్సర్ బాధితులకు రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. క్యాన్సర్ కు అడ్డు కట్టవేసేందుకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది

Cancer Vaccine: క్యాన్సర్ బాధితులకు రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. క్యాన్సర్ కు అడ్డు కట్టవేసేందుకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ వచ్చే ఏడాది అంటే 2025 నుంచి క్యాన్సర్ రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపింది. క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగించే ఈ వ్యాక్సిన్‌ను రేడియోలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ చీఫ్ ఆండ్రీ కప్రిన్ అభివృద్ధి చేశారు. క్యాన్సర్ రహిత దేశంగా అవతరించాలనే ఉద్దేశంతో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

వచ్చే ఏడాది ప్రారంభం నుంచే ఈ వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని తెలిపింది. అయితే వ్యాక్సిన్ అనేది ఏ క్యాన్సర్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది..? ఎంత ప్రభావం చూపుతుంది..? ఈ వ్యాక్సిన్ పేరు వంటి పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. దీని వల్ల కణితులు పెరగకుండా నిరోధించవచ్చని చెబుతున్నారు. అయితే క్యాన్సర్ అంతం చేయడానికి కొన్నిరకాల వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడం శాస్త్రీయంగా సాధ్యమే.. ఇతర దేశాలు కూడా ప్రస్తుతం ఇలాంటి అభివృద్ధిపై కసరత్తు చేస్తున్నాయి.

ప్రస్తుతం ప్రపంచం మొత్తం క్యాన్సర్‌ సమస్యతో అల్లాడుతోంది. దీని బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచాన్ని శరవేగంగా కబలిస్తున్న క్యాన్సర్.. ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అందరూ దీని బారినపడుతూనే ఉన్నారు. ప్రతిఏటా ఎంతోమందిని బలితీసుకుంటుంది. ఒకసారి సోకిందంటే దీని నుంచి బయటపడడం చాలా కష్టం. చికిత్సతో పాటు మరెన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. తగ్గినట్టు అనిపించినా.. మళ్లీ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ తరుణంలో రష్యా చెప్పిన గుడ్ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మందికి ఉపశమనం కల్పిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories