America: భారత్ లో ఉండకండి వచ్చేయండి - అమెరికా

USA Says Do not Stay in India to Americans Due to Corona Cases in India Rising Rapidly
x

అమెరికా (ఫైల్ ఇమేజ్)

Highlights

America: ఇండియాలోని అమెరికన్లు సాధ్యమైనంత త్వరగా ఆ దేశం నుంచి * వచ్చేయాలని అమెరికా ప్రభుత్వం పిలుపునిచ్చింది.

America: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. గత 24 గంటలో దేశంలో3,79,2557 కేసులు నమోదు కాగా 2,645 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళన చెందిన అమెరికా ఇండియాలోని అమెరికన్లు సాధ్యమైనంత త్వరగా ఆ దేశం నుంచి వచ్చేయాలని అమెరికా ప్రభుత్వం పిలుపునిచ్చింది.

ఈ మేరకు 4 ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. భారత దేశానికి తమ అమెరికన్లు ఇప్పట్లో వెళ్లరాదని కూడా సూచించింది. ఇండియా-అమెరికమధ్య యూరప్ దేశాల ద్వారా రోజూ 14 విమాన సర్వీసులు నడుస్తాయి. ఇండియా నుంచి రాగోరేవారు తమకు అందుబాటులో ఉన్న కమర్షియల్ విమాన సర్వీసులను ఉపయోగించుకోవాలని కూడా బైడెన్ ప్రభుత్వం సూచించింది. ప్యారిస్, ఫ్రాంక్ ఫర్ట్ ద్వారా పలు విమాన సర్వీసులు నడుస్తాయి. వీటిని ఇండియాలోని అమెరికన్లు వినియోగించుకోవాలని పేర్కొంది.

అటు జర్మనీ, సింగపూర్, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలు తమవంతు సాయాన్ని ప్రకటించాయి. అమెరికా ఇప్పటికే 10 కోట్ల డాలర్ల విలువైన ఆక్సిజన్, ఇతర వైద్య పరికరాలు, మందులను పపనున్నట్టు పేర్కొంది. రష్యా కూడా తమ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ని పెద్ద ఎత్తున పంపనుంది.

ఇండియా నుంచి అన్ని విమాన సర్వీసులను ఆస్ట్రేలియా నిలిపివేసింది. మరోవైపు బ్రిటన్ కూడా తమ దేశంలో ప్రవేశించగోరే భారతీయులపై ఆంక్షలు విధించింది. కాగా కోవిడ్ పై భారత ప్రభుత్వం జరిపే పోరుకు తాము కూడా సహకరిస్తామని గూగుల్, అమెజాన్, బ్లాక్ స్టోన్ ప్రకటించాయి. గూగుల్ ఇప్పటికే 135 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించింది. ఐసియూ వెంటిలేటర్లను పంపుతామని అమెజాన్ వెల్లడించింది. యాపిల్ సంస్థ కూడా విరాళాలను ప్రకటించింది. అయితే వీటి వివరాలను వెల్లడించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories