US Visa: ఇంటర్య్వూలు లేకుండానే అమెరికా వీసాలు

US Visas Without Interviews
x

US Visa: ఇంటర్య్వూలు లేకుండానే అమెరికా వీసాలు

Highlights

US Visa: కొన్ని నిర్దిష్ట కేటగిరీలకే ఈ వెసులుబాటు వర్తిస్తుందని వెల్లడి

US Visa: కొన్ని కేటగిరీల అమెరికా వీసాలను ఇంటర్వ్యూలు లేకుండా జారీ చేయాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు వీసా, ఇమ్మిగ్రేషన్‌ విభాగం అధికారులు ఆయా దేశాల్లోని కాన్సులేట్‌ వర్గాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది డిసెంబరు వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. కొవిడ్‌ కల్లోలం నేపథ్యంలో నిలిపివేసిన బీ1, బీ2 వీసాల జారీ ప్రక్రియను తిరిగి ప్రారంభించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

బీ1, బీ2 కేటగిరీలతో పాటు.. ఎఫ్‌, హెచ్‌-1, హెచ్‌-3, హెచ్‌-4, నాన్‌-బ్లాంకెట్‌ ఎల్‌, ఎం, ఓ, పీ, క్యూ, అకాడమిక్‌-జె వీసాలకు కూడా ఇంటర్వ్యూ అవసరం ఉండదని అధికారులు వివరించారు. అంతేకాకుండా.. వీసా గడువు ముగిసిన 48 నెలల్లోపు రెన్యూవల్‌ చేయించుకుంటే వారికి కూడా ఇంటర్వ్యూ ఉండదని ప్రకటించారు. అయితే.. ఇదివరకూ పేర్కొన్న అన్ని కేటగిరీల్లో.. గతంలో వీసాలు తిరస్కరణకు గురైన వారికి మాత్రం ఇంటర్వ్యూలుంటాయని తెలిపారు.

ఇంటర్వ్యూల నుంచి ఆయా కేటగిరీల వీసాలను మినహాయించినా.. భారత్‌లోని దాదాపు అన్ని కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లకు మాత్రం వేచిచూడాల్సిన పరిస్థితులున్నాయి. కొవిడ్‌ కారణంగా నెలకొన్న పెండన్సీయే ఇందుకు కారణమని అధికారులు వివరించారు. మరోవైపు.. ఇప్పటికే వీసాల కోసం దరఖాస్తు ఫీజులు చెల్లించి.. కరోనా నేపథ్యంలో ఆ ప్రక్రియ నిలిచిపోయినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అలాంటి వచ్చే ఏడాది సెప్టెంబరు 30లోపు ఎప్పుడైనా తమ వీసా దరఖాస్తును పునరుద్ధరించుకోవచ్చని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories