Usha Chilukuri Vance: అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా తెలుగమ్మాయి ఉష భర్త.. ఎవరీ ఉష చిలుకూరి వాన్స్?

Usha Chilukuri Vance: అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా తెలుగమ్మాయి ఉష భర్త.. ఎవరీ ఉష చిలుకూరి వాన్స్?
x
Highlights

Who is Usha Chilukuri Vance?: అమెరికా అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. రిపబ్లిక్ వర్సెస్ డెమోక్రటిన్ల మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన ఈ...

Who is Usha Chilukuri Vance?: అమెరికా అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. రిపబ్లిక్ వర్సెస్ డెమోక్రటిన్ల మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈసారి తెలుగు మూలాలున్న మహిళ భర్త అమెరికా వైస్ ప్రెసిడెంట్ కానున్నారు. వారు ఎవరో కాదు.. అమెరికాకు వైస్ ప్రెసిడెంట్ అనిపించుకోబోతున్న జేడి వాన్స్, ఆయన భార్య ఉషా చిలుకూరి వాన్స్. దీంతో ప్రస్తుతం ఉషా చిలుకూరి వాన్స్ పేరు ఇప్పుడు భారత్‌లో మార్మోగిపోతోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లకు గానూ.. సాధారణ మెజార్టీకి అవసరమైన 270 మార్క్‌ను ట్రంప్ సాధించారు. దీంతో అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. ఇక అమెరికా అధ్యక్షుడిగా గెలిచానన్న ఆనందంలో డోనల్డ్ ట్రంప్ మునిగిపోయారు. ఆ ఆనందంలో ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్ వద్ద భారీ సంఖ్యలో హాజరైన తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికా మనకు భారీ మద్దతును ఇచ్చిందన్నారు. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఆ క్రమంలోనే రిపబ్లికన్స్ పార్టీ తరపున వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్న జేడి వాన్స్‌ని కూడా ఆయన ప్రశంసించారు. ఇకపై మిమ్మల్ని వైస్ ప్రెసిడెంట్ అని పిలవొచ్చు అంటూ గట్టిగా అరిచి చెప్పారు. జేడీవాన్స్, ఆయన భార్య ఉష చిలుకూరి వాన్స్‌ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దీంతో ప్రస్తుతం ఉషా చిలుకూరి పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జేడీ వాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక కానుండడంతో ఆయన భార్య ఉష చిలుకూరి గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇంతకీ ఎవరీ ఉషా చిలుకూరి. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామం ఉషా చిలుకూరి పూర్వీకుల స్వగ్రామం. ఉషకు తాత వరుస అయిన రామ్మోహన రావు కుటుంబం ప్రస్తుతం ఇక్కడే నివాసం ఉంటోంది. ఉష పూర్వీకులు దశాబ్దాల కిందటే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. సాయిపురంలో 18వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన సంతానమే శాఖోపశాఖలుగా ఉష వరకు విస్తరించింది. ఆమె ముత్తాత వీరావధాన్లకు ఐదుగురు సంతానం. రామశాస్త్రి, సూర్యనారాయణ శాస్త్రి, సుబ్రహ్మణ్య శాస్త్రి, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణ మూర్తి అందరూ ఉన్నత విద్యావంతులే.

రామశాస్త్రి మద్రాసు వలస వెళ్లిపోయి మద్రాసు ఐఐటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన భార్య బాలాత్రిపుర సుందరి . వీరికి అవధాని, నారాయణ శాస్త్రి, రాధాకృష్ణ, శారద అని నలుగురు సంతానం ఉన్నారు. ముగ్గురు కుమారులు అమెరికాలో స్థిరపడగా శారద మాత్రం చెన్నైలో నివాసం ఉంటూ వైద్యురాలిగా స్థిరపడ్డారు. ఏరో నాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన రాధాకృష్ణ శాన్‌డియాగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. పామర్రుకు చెందిన లక్ష్మితో ఆయనకు వివాహం కాగా వారి సంతానమే ఉష.

వైజాగ్‌కు చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్ శాంతమ్మకు ఉష మనవరాలు వరుస అవుతారు. శాంతమ్మ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 96 ఏళ్ల వయస్సులో ఇప్పటికీ పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి ద్వారా ఉషతో తనకు బంధుత్వం ఉందని.. ఆమె తనకు మనవరాలు అవుతుందని శాంతమ్మ తెలిపారు. శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి కొన్నేళ్ల కిందట మృతిచెందారు. సుబ్రహ్మణ్య శాస్త్రి సోదరుడు రామశాస్త్రి కుమారుడైన రాధాకృష్ణ కుమార్తె ఉష.

US Election 2024 Results Live Updates: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎక్స్‌క్లూజీవ్ న్యూస్ లైవ్ అప్‌డేట్స్

Show Full Article
Print Article
Next Story
More Stories